బేబీ బంప్‌తో ఫోటోలకు పోజిచ్చిన శ్రేయా ఘోషల్ | Singer Shreya Ghoshal Shares Her Baby Bump Photos Goes Viral | Sakshi
Sakshi News home page

శ్రేయా ఘోషల్ బేబీ బంప్‌ ఫోటోలు వైరల్‌

Published Mon, Mar 29 2021 11:20 AM | Last Updated on Mon, Mar 29 2021 5:49 PM

Singer Shreya Ghoshal Shares Her Baby Bump Photos Goes Viral  - Sakshi

ముంబై : ప్రముఖ గాయని  శ్రేయా ఘోషల్ ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తుంది. 'నా జీవితంలోనే అ‍ద్భుతమైన దశను అనుభవిస్తున్నా. ఇదంతా దేవుడి లీల' అని బేబీ బంప్‌తో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీన్ని చూసిన అభిమానులు మరోసారి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం శ్రేయా ఘోషల్ బేబీ బంప్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలె తాను తల్లి కాబోతున్నట్లు శ్రేయా ఘోషల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

బేబీ శ్రేయాదిత్య (శ్రేయా, ఆమె భర్త శిలాదిత్య పేర్లు కలిసేలా) కమింగ్‌ అంటూ  స్వయంగా మధుర క్షణాలను  ఫ్యాన్స్‌కు షేర్‌ చేశారు. తమ జీవితంలో ఈ సరికొత్త అధ్యాయాన్ని పంచుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కాగా 2015, ఫిబ్రవరి 5న శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ .. బాలీవుడ్‌.. మాలీవుడ్‌.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ ఇలా పలు భాషల్లో తన అద్భుత గాత్రంతో అలరిస్తున్నారామె. ఇటీవలె తెలుగులో ‘ఉప్పెన’, ‘టక్‌ జగదీశ్‌’ సినిమాల్లో పాడారు. 

చదవండి : శ్రేయా సీమంతం
అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వచ్చింది : యంగ్‌ హీరో


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement