
ముంబై: బాలీవుడ్ ప్రముఖ గాయని నేహా కక్కర్, పంజాబ్ సింగర్ రోహాన్ ప్రీత్ సింగ్‌ల వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేహా శుక్రవారం ఓ ఫొటో షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. భర్త రోహాన్‌తో కలిసి ఉన్న ఫొటోను నేహా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో నేహా తన బేబీ బంప్‌ను చూపిస్తూ నిలబడగా.. వెనకాల రోహన్ తనను పట్టుకుని ఉన్నాడు. దీనికి ‘కేర్ టేకర్’ అనే క్యాప్షన్‌కు హార్ట్ ఎమోజీని జత చేసి షేర్ చేశారు. అయితే ఇందులో తను తల్లి కాబోతున్నట్లు స్పష్టంగా చెప్పకపోవడంతో అభిమానులు కాస్తా గందరగోళానికి గురవుతున్నారు. (చదవండి: వైభవంగా ప్రముఖ గాయని వివాహం)
ఇక నేహా పోస్టును రోహాన్ రీపోస్ట్ చేస్తూ.. ‘అవును.. ఇప్పడు మరింత కేర్ తీసుకోవాలి’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో నేహా తల్లి కాబోతోందని స్పష్టమవ్వడంతో వారి అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక ఈ జంటకు నెటిజన్లు సోషల్ మీడియాలో శుభకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నేహా, రోహాన్‌లు కొంతకాలంగా ప్రేమించుకుని గత అక్టోబర్ 24న ఢిల్లీలోని గురుద్వార్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నేహా ప్రముఖ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: ‘మీ జంట చూడముచ్చటగా ఉంది’)
Comments
Please login to add a commentAdd a comment