
కుక్కకు టాటూ నివాళి
పాప్‌స్టార్ మిలీ సైరస్ తన పెంపుడు కుక్కకు నివాళిగా టాటూ పొడిపించుకుంది. మిలీ అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క ఫ్లాయిడ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించింది. దాని మరణంతో మానసికంగా కుంగిపోయిన మిలీ, కుక్క జ్ఞాపకాన్ని శాశ్వతం చేసుకునేందుకు తన ఎడమ పక్కటెముకల వద్ద దాని బొమ్మను పచ్చబొట్టు వేయించుకుంది.