'ఓ కుర్రాడి కోసం మేం గొడవపడ్డాం' | I'm big fan of Miley Cyrus, says Selena Gomez | Sakshi
Sakshi News home page

'ఓ కుర్రాడి కోసం మేం గొడవపడ్డాం'

Published Fri, Feb 5 2016 9:21 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

'ఓ కుర్రాడి కోసం మేం గొడవపడ్డాం'

'ఓ కుర్రాడి కోసం మేం గొడవపడ్డాం'

లండన్: తాను నా గురించి ఏమనుకుంటుందో తెలీదు కానీ, ఆమెకు నేను పెద్ద అభిమానిని అంటూ నటి, పాప్ స్టార్ సింగర్ సెలెనా గొమేజ్ చెప్పింది. ఇంతకు గొమేజ్ ఈ మాటలన్నది ఎవరి గురించో తెలిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. సింగర్, లిరిక్ రైటర్ మిలే సిరస్ తో విభేదాలున్నాయని తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. అటువంటి వార్తలకు ఒక్కసారిగా గొమేజ్ ఫుల్స్టాప్ పెట్టేసింది. అసలు విషయాన్ని బయటపెట్టింది. మిలే సిరస్, సెలెనా గొమేజ్ ఇద్దరూ చిన్నతనంలో ఒకే అబ్బాయిని ప్రేమించారట. అయితే, స్నేహితురాలు అని ఎవ్వరూ ఈ విషయాన్ని వదిలిపెట్టలేరు కదా! అందుకే మా ఇద్దరి మధ్య ఈ విషయంలో మాత్రమే ఆ సమయంలో కాస్త విభేదాలు తలెత్తాయి. ఆ అబ్బాయి కారణంగా ఒకరంటే మరొకరికి పడేది కాదు.

తాను ఏం చేసినా సింగర్ సిరస్కు, అలాగే సిరస్ ఏం చేస్తున్నా తనకు అంతగా నచ్చేదికాదంటూ గొమేజ్ చెప్పుకొచ్చింది. 'ఏది ఏమైతేనేం.. నేను మాత్రం ఆమె మ్యూజిక్ కు బిగ్ ఫ్యాన్. ఆమె నా గురించి ఏమనుకుంటో చెప్పలేను' అని గొమేజ్ వివరించింది. సరిగ్గా చెప్పాలంటే పదహారేళ్ల ప్రాయంలో మేం ఇద్దరం ఒకే కుర్రాడిని ప్రేమించాం. ఓ మై గాడ్.. ప్రస్తుతం మేమిద్దరం మా కెరీర్లలో సెటిల్ అయ్యాం అని చెప్పిన గొమేజ్ ఇప్పుడు జస్టిస్ బీబర్ తో డేటింగ్ చేస్తుందన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement