రాంచీ: జార్ఖండ్, మహారాష్ట్రలలో నేడు (బుధవారం) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మరో నాలుగు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
యూపీలోని 9 సీట్లు (కర్హాల్, సిసమావు, కతేహరి, కుందర్కి, మీరాపూర్, ఘజియాబాద్, ఫుల్పూర్, ఖైర్, మజ్వాన్), పంజాబ్‌లోని 4 సీట్లు (గిద్దర్‌బాద, డేరా బాబా నానక్, చబ్బేవాలా, బర్నాలా), కేరళలోని పాలక్కాడ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ జరుగుతోంది.
పంజాబ్‌లోని డేరా పఠానా గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్- ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గుర్దీప్ సింగ్ రంధావా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి, ఇరు వర్గాల వారినీ శాంతిపజేశారు.
ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment