pujab
-
ఆప్‌కు కాంగ్రెస్ చురకలు
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మద్దతునిస్తూనే ఆప్‌కు కాంగ్రెస్ చురకలంటించింది. ఇండియా కూటమి భాగస్వామైన ఆప్‌ను కాపాడుకుంటూనే పంజాబ్‌లో తమ నేతలను అరెస్టు చేయడంపై విరుచుకుపడింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టుపై స్పందించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. బీజేపీ ప్రతికార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశంలో దర్యాప్తు సంస్థలు రాజకీయ లక్ష్యాల కోసం పనిచేస్తున్నాయని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. బీజేపీ ప్రతికార రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని అన్నారు. అదే క్రమంలో తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంపై ఆప్‌ను నిందించారు. AAP MP Sh. @SanjayAzadSln ji's arrest by the ED takes the BJP's vendetta politics to another level. We stand in complete solidarity with him and reject the use of law enforcement agencies to settle political scores. For this reason, we also oppose the arrests of All India… — K C Venugopal (@kcvenugopalmp) October 5, 2023 పంజాబ్‌లో 2015నాటి డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరాను పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మఖ్యమంత్రి ఓపీ సోనీని కూడా అరెస్టు చేశారు. పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉన్న నేపథ్యంలో తమ నేతలను అరెస్టు చేయడం పట్ల కేసీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నేతల అరెస్టులు న్యాయబద్ధంగా జరలేదని ఆరోపించారు. కూటమిలో పోరు: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్‌కు మద్యం కుంభకోణం కేసులో మద్దతుగా నిలుస్తోంది. అటు.. పంజాబ్‌లో సొంత అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్‌కు మధ్య సీట్ల షేరింగ్‌లోనూ వివాదాలు కొనసాగుతున్నాయి. అవినీతి మయమైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆప్ నేతలు అంటున్నారు. కూటమిలో ఆప్ భాగస్వామిగా ఉంటుందని పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం: మద్యం కుంభకోణంలో అక్రమాలకు పాల్పడి ఆ డబ్బును పార్టీ ప్రచారాల కోసం వినియోగించారని ఈడీ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే జైలు పాలయ్యారు. తాజాగా మరో ఆప్ నేత సంజయ్ సింగ్‌ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఇదీ చదవండి: వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా? -
భద్రత రికార్డులను భద్రపరచండి
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రధాని మోదీ బుధవారం నాటి పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి అన్ని రికార్డులను తక్షణమే భద్రపరచాలని పంజాబ్ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధానికి చేసిన రక్షణా ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు, కేంద్ర రక్షణ, నిఘా సంస్థల నుంచి అన్ని రకాల వివరాలను సమీకరించి భద్రపరచాలని సూచించింది. ఘటనపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీల పరిశోధనను సోమవారం వరకు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫిరోజ్‌పూర్ ఘటనపై లాయర్స్ వాయిస్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ఇది ప్రధాని భద్రతకు సంబంధించిన అంశమని గుర్తించి సంబంధిత రికార్డులన్నిటినీ భద్రపరచమని హైకోర్టు రిజిస్ట్రార్‌ను సుప్రీం ఆదేశించింది. రిజిస్ట్రార్‌కు చండీగఢ్ డీజీపీ, జాతీయ భద్రతా సంస్థకు చెందిన ఐజీ ర్యాంకుకు తగ్గని అధికారి సహకరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రిజిస్ట్రార్ జనరల్‌కు రికార్డుల అందజేత విషయంలో పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలను ఆదేశించింది. ఫిరోజ్‌పూర్ ఘటన ఉద్దేశపూర్వక కుట్రని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య కార్యదర్శి, డీజీపీలు బాధ్యతలు మరిచారని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. సీఎస్, డీజీపీపై తగిన చర్యలు(సస్పెన్షన్) తీసుకోవాలని కోరారు. అధికారిక రికార్డుల మార్పిడి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సుప్రీంను కోరారు. మాకు ఓకే జరిగిన ఘటనపై లోతైన విచారణ జరపాలన్న పిటిషనర్ డిమాండ్‌పై తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. పంజాబ్ పోలీసులు రూట్ క్లియర్ చేసిన తర్వాతే ప్రధాని కాన్వాయ్ బయలుదేరిందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ప్రధాని పర్యటనకు ముందే సిక్స్ ఫర్ జస్టిస్ అనే నిషేధిత సంస్థ చైర్మన్ పన్ను ఒక వీడియోను సర్క్యులేట్ చేసిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అందువల్ల ఈ ఘటనలో అంతర్జాతీయ ఉగ్రవాద కోణం ఉండే అవకాశం ఉందని, కనుక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జోక్యం అవసరమేనని చెప్పారు. ఘటనకు సంబంధించిన మొత్తం రికార్డులను ఎన్ఐఏ అధికారి సహకారంతో ఒక స్వతంత్ర వ్యక్తి సేకరించి భద్రపరిచేలా ఆదేశించాలన్నారు. ఇది ఒక ప్రత్యేక ఘటనని, అంతర్జాతీయంగా సిగ్గుపడేలా చేసిందన్నారు. రోడ్డు దిగ్భంధంపై స్థానిక పోలీసులు ముందుగా వార్నింగ్ వాహనంలోని వారికి సమాచారమివ్వలేదన్నారు. ఫ్లైఓవర్‌కు రెండో వైపు నిరసనకారులు చేరి ఉంటే పరిస్థితి విషమించేదన్నారు. ఇది సీరియస్ సంఘటనని తాము కూడా అంగీకరిస్తున్నట్లు పంజాబ్ అడ్వకేట్ జనరల్ పట్వాలియా తెలిపారు. పిటిషన్‌లోని అంశాలపై భేదాభిప్రాయమున్నా, ఘటనను తేలిగ్గా తీసుకోవడం లేదన్నారు. దీనితో ఎవరైనా అధికారులకు సంబంధం ఉంటే వారు విచారణ ఎదుర్కోక తప్పదన్నారు. ఘటనపై ఎలాంటి విచారణకు కోర్టు ఆదేశించినా అభ్యంతరం లేదన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ అంతర్గతమైనదని, అందువల్ల దాని విచారణ కొనసాగించే అవకాశమివ్వమని కోర్టును తుషార్ కోరారు. అయితే కేంద్ర కమిటీలో సురేశ్ ఉండకూడదని రాష్ట్ర న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఫిరోజ్‌పూర్‌కు కేంద్ర బృందం ప్రధాని భద్రతా లోపంపై విచారణకు కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ శుక్రవారం ఫిరోజ్‌పూర్ ఫ్లై ఓవర్‌ను పరిశీలించింది. ఈ ఘటనపై కేంద్రానికి పంజాబ్ ప్రభుత్వం నివేదిక అందజేసింది. ఫిరోజ్‌పూర్ ఘటనలో గుర్తుతెలియని 150 మంది నిరసనకారులపై పంజాబ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, శుక్రవారం ప్రత్యక్షంగా హాజరవ్వాలని ప్రధాని పర్యటనతో సంబంధమున్న పలువురు అధికారులకు కేంద్ర బృందం ముందే సమన్లు జారీ చేసింది. ఈ విచారణకు పంజాబ్ డీజీపీ సిద్ధార్ధ్ చటోపాధ్యాయ హాజరవలేదు. ఆగని విమర్శల పర్వం ఫిరోజ్‌పూర్ ఘటనపై ఆయా పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పంజాబ్‌లో చన్నీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ డిమాండ్ చేశారు. ప్రధాని పర్యటనలో భద్రతాలోపాలు కల్పించడం ద్వారా కాంగ్రెస్ కుట్రపూరిత బుద్ధి బయటపడిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. ఘటనపై కాంగ్రెస్ అగ్రనా యకత్వం ఎందుకు మౌనం వహిస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. మరోవైపు మోదీ హాజరవ్వాల్సిన ర్యాలీకి అతి తక్కువ మంది హాజరైన విషయం తెలిస్తే పరువు పోతుందని పసిగట్టే బీజేపీ ఈ భద్రతాలోపం నాటకం ఆడుతోందని పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే ఈ సంఘటన జరిగిందని పంజాబ్ సీఎం చన్నీ ఆరోపించారు. ప్రధానిని ర్యాలీ వద్దకు చేరకుండా రైతులు అడ్డుకోకుండా ఉండాల్సిందని, అప్పుడు ఖాళీ కుర్చీలు చూసి ప్రధాని సంతోషపడేవారని, వాటిని ఉద్దేశించి ప్రసంగించేవారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎద్దేవాచేశారు. గతంలో తన సభకు కేవలం 25 మంది వచ్చినా తాను వెళ్లి, వారితో మాట్లాడాకే వెనుతిరిగానన్నారు. ఉల్లంఘనకు మరో నిదర్శనం.. బుధవారం ప్రధాని కాన్వాయ్ పంజా బ్లోని ఫ్లైఓవర్‌పై నిలిచిపోయినప్పుడు చాలా దగ్గరగా కొందరు బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్న వీడియో ఒకటి మీడియా లో ప్రత్యక్షమైంది. వారు ‘బీజేపీ జిందాబాద్’ అని నినాదాలు చేస్తుండగా ప్రధాని కారును ఎస్పీజీ సిబ్బంది కవచంలాగా ఏర్పడి తరలించడం వీడియోలో కనిపించింది. బుధవారం ప్రధాని భద్రతా ఏర్పాట్ల ఉల్లం ఘనకు ఇది మరో ఉదాహరణ అని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రధాని కాన్వాయ్‌కు కొంత దూరంలో రైతులున్న వీడియో సైతం తాజాగా మీడియాలో షేర్ అవుతోంది. తమకన్నా బీజేపీ కార్యకర్తలే ప్రధాని కారుకు దగ్గరగా ఉన్నారని కొందరు రైతులు ఆరోపించారు. చదవండి: నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ -
కథా నాయకుడా? కలల నాయకుడా?
విశ్లేషణ పంజాబ్ ఎన్నికలలో కేజ్రీవాల్ తన సత్తా చూపితే పరిస్థితులు ఏ విధంగా మార తాయి? అదే జరిగితే దేశం మార్పు దిశగా కదులుతుంది. కొత్త నాయకత్వం, కొత్త పార్టీలు ఏర్పడి మార్పును తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. మార్చి 15వ తేదీని ‘ఐడస్ ఆఫ్ మార్చి’ అని ఐదు వందల ఏళ్ల క్రితం షేక్స్పియర్ పిలి చాడు. అదే రోజున రోమ్ చక్ర వర్తి జూలియస్ సీజర్‌ను హత మారుస్తారని ఒక జ్యోతిష్కుడు చెప్పాడట. అలాగే జరిగిందట. అంత కాకపోయినా, వచ్చే 15వ తేదీకి భారతదేశ చరి త్రలో ముమ్మాటికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎన్ని కలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలోను ఆ రోజునే ఫలి తాలు వెలువడుతున్నాయి. అంటే చాలామంది నేతల తలరాతలు–నరేంద్ర మోదీ, రాహుల్‌గాంధీ, అఖిలేశ్ యాదవ్, మరీ ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్‌ల భవి ష్యత్తు తేలబోతున్నది. రాహుల్, అఖిలేశ్‌లు కుటుంబ పాలన నుంచి వచ్చినవారు. మోదీ నేపథ్యం అలాంటిది కాకున్నా, ఆయన ఎదురుగాలిలో ప్రయాణిస్తున్నారు. మోదీ జాతీయ రాజకీయాలలో కొత్త గాలి. అయినా కేజ్రీవాల్ మాదిరిగా ఆయనది ఒంటరి పోరాటం కాదు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరిస్థితి వేరు. జాతీయ రాజ కీయ చిత్రంలో ఆయన ఇప్పుడొక ఆకర్షణ. అందుకే అందరి దృష్టి ఆయన మీదే ఉంది. పైగా కొత్త వారికి రాజకీయంగా ఎదిగే అవకాశం ఇస్తున్న నాయకుడు ఆయనే. గోవా, పంజాబ్ ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడు పెరుగుతున్న ఆసక్తికి కారణం కూడా ఆయనే. ఢిల్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ విజయాలు చరిత్రా త్మకం. కేంద్రంలో, ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆయన ఆ పార్టీని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మట్టి కరిపించారు. ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగం వదిలి అన్నా హజారే ఉద్యమంలో చేరిన కేజ్రీవాల్ ఆప్‌ను స్థాపించి 2013 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో 28 (మొత్తం 70)స్థానాలు గెలిచారు. కానీ ఎనిమిది వారాలకే ఆయన ప్రభుత్వం పతనమైంది. తరువాత 2014 ఎన్నికలలో 67 సీట్లు గెలిచారు. మూడు చోట్ల గెలిచి బీజేపీ కకావికలైంది. కాంగ్రెస్ అధఃపాతాళానికి పోయింది. అందుకే ఆ రెండు జాతీయ పార్టీల లక్ష్యం ఆయనే. కేజ్రీవాల్ కనుక అప్రతిహతంగా కొనసాగిపోతే ఢిల్లీ, హరియాణా, పంజాబ్, హిమాచల్, గోవా వంటి చిన్న రాష్ట్రాలలో తమ చిరునామా కూడా ఉండదని కాంగ్రెస్ భయం. చిన్న రాష్ట్రాల ఎన్నికలలో పోరాడే సత్తా ఆయనకు ఉంది. పైగా ఈ చిన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ లేదా బీజేపీలదే ఆధిపత్యం. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నా, కేజ్రీవాల్ పార్టీ గట్టిగా పోరాడుతున్నది మాత్రం రెండు అసెంబ్లీల వరకే. అవే పంజాబ్, గోవా. ఇప్పటిదాకా అక్కడ బీజేపీ–అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలకే స్థానం. ఇప్పుడు ఆప్ కొత్త ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. భారత రాజకీయాలలో ఆప్ పెను కంపాలను సృష్టిం చడం ఆరంభించినది పంజాబ్‌తోనే. 14 స్థానాలతో ఆ రాష్ట్రానికి లోక్‌సభలో పెద్ద ప్రాధాన్యం లేకున్నా, ఆ రాష్ట్రంలో ప్రధాన వర్గం సిక్కుల ప్రాధాన్యం మాత్రం ప్రపంచ వ్యాప్తమైనది. అలాంటి చోట బయటివారి నాయకత్వంలోని పార్టీ ఆప్ ప్రవేశించింది. ఎన్నికలు సక్రమంగా జరిగితే 30 శాతం ఓట్లతో ఆప్ పార్టీకి 40 ఎమ్మెల్యే స్థానాలు (మొత్తం 117) దక్కుతాయని అంచనా. ఇదే నిజమైతే దేశ రాజకీయాలకు ఇదొక కుదుపు కాగలదు. కాంగ్రెస్, బీజేపీతో విసిగిపోయిన చోట ఆప్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు ప్రజలు. పంజాబ్‌లో వందేళ్ల నాటి అకాలీదళ్ మత పార్టీ స్థాయి నుంచి బాదల్ కుటుంబ పార్టీ స్థాయికి దిగ జారింది. పంజాబ్ కాంగ్రెస్ అంటే పాటియాలా సంస్థా నాధీశుల వంశీకుడు అమరీందర్ సింగ్ జేబు సంస్థ. అవి నీతి బంధుప్రీతి విషయంలో ఆ రెండు పార్టీలు ఒక్కటే. ఇంతకీ పంజాబ్ ఎన్నికలలో కేజ్రీవాల్ తన సత్తా చూపితే పరిస్థితులు ఏ విధంగా మారతాయి? అదే జరి గితే దేశం మార్పు దిశగా కదులుతుంది. కొత్త నాయ కత్వం, కొత్త పార్టీలు ఏర్పడి మార్పును తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. వంశ పారంపర్య పాలనకు బెడ దగా మారుతుంది. యువతరం ముందుకు వస్తుంది. దేశం పట్టణీకరణ చెందుతున్న కారణంగా యువత రంలో కుల ప్రభావం తగ్గి, నిజమైన రాజకీయ పార్టీల వైపు మొగ్గుతారు. ఈ దశలో బాదల్ కుటుంబీకులను ఓటర్లు నిరాకరించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకుంటే అది రాహుల్‌కు పెద్ద దెబ్బగా మిగులుతుంది. అంటే కాంగ్రెస్కీ, రాహుల్కీ కూడా పెద్దగా ప్రజాకర్షణ లేదనీ, ప్రభుత్వ వ్యతిరేకత అన్న అంశంతో తప్ప గెలవలేరనీ నిర్ధారణ అవుతుంది. అదే సమయంలో కేజ్రీవాల్ ప్రతిష్ట పెరుగుతుంది. భవి ష్యత్తులో మరిన్ని అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆయన విజయం సాధించగలుగుతారు. పంజాబ్ ఓటర్లు కేజ్రీ వాల్ పట్ల మొగ్గు చూపారంటే, దానర్థం దేశ ప్రజలు కూడా మార్పును కోరుతున్నారనే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చూపాలని కేజ్రీవాల్ ఇప్పటికే ఆలో చిస్తున్నారు. ఆ పోరులో పటేల్ వర్గ నేత హార్దిక్ పటే ల్కూ, యువ దళితనేత జిగ్నేశ్కూ కేజ్రీవాల్ స్నేహ హస్తం అందిస్తారు. పంజాబ్‌లో ఆప్ విజయం గుజరాత్ ఓటర్లను కూడా చైతన్యవంతం చేస్తుంది. గుజరాత్ కాంగ్రెస్ 1996 నుంచి అహ్మద్ పటేల్ చేతిలో బందీ అయి ఉంది. బీజేపీలో కొత్త నాయకులు లేరు. అయితే ఇప్పటికే కేజ్రీవాల్ అక్కడ తన ఉనికిని చాటుకున్నారు. పంజాబ్‌లో కేజ్రీవాల్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తే కాంగ్రె స్కు గుదిబండగా తయారవుతారు. ప్రస్తుత అంచనా లను బట్టి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్‌కు ఉన్నట్టు అంచనా. ఆ అవకాశం తప్పితే, హంగ్ తప్పదు. అప్పుడైనా కేజ్రీవాల్ పెద్ద శక్తే. ఇదంతా మార్చి 15 తరువాత స్పష్టమవుతుంది. షేక్స్పియర్ మాట నిజమో కాదో తేలేది కూడా అప్పుడే. (వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : ppr193@gmail.com)