asom
-
పోలీస్ కాల్పుల్లో ఉగ్రవాది హతం
అసోం: మరోసారి భారత్ లోకి చొరబడిన ముష్కరులు రెచ్చపోయారు. అసోంలోని కొక్రాఝుర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఉగ్ర మూకలు పేట్రేగిపోయాయి. ఆ మూకలు తమ వద్దనున్న పేలుడు పదార్థాలతో భారీ కుట్రకు పన్నాగం పన్నాయి. అయితే వీరి దాడిని భద్రతా దళాలు తిప్పికొట్టాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతా దళాలు తుపాకీ, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. -
అసొంలో బోడో ఉగ్రవాదుల దాడి, 10 మంది హతం
అసొంలో మరోసారి అశాంతి, అరాచకం రాజ్యమేలింది. అసొంలోని బోడోలాండ్ ప్రాంత పాలనా జిల్లా (బీటీఏడీ) పరిధిలో ఎన్ డీ ఎఫ్ బీ (నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్) ఉగ్రవాదులు ఇద్దరు పసివాల్లు, నలుగురు మహిళలు సహా పదిమందిని పొట్టనబెట్టుకున్నారు. ఎన్నికల వేళ రాష్ట్రంలోని బోడో జనాధిక్య ప్రాంతాల్లో బోడో గ్రూపులైన బోడోలాండ్ టైగర్స్ ఫోర్స్ (బిఎల్ టీ ఎఫ్) ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. ఇదే ఆధిక్య పోరులో అమాయకులు బలయ్యారు. కోక్రాఝార్ జిల్లాలో ఏడుగురు చనిపోయారు. ఉగ్రవాదులు ఒక ఇంట్లో చొరబడి ఏడుగురిని చంపేశారు. అదే రాత్రి బాస్కా జిల్లాలో ముగ్గురిని ఉగ్రవాదులు చంపేశారు. దీంతో గతేడాది కోక్రాఝార్ తరువాత నెలకొన్న ప్రశాంతి భగ్నమై కథ మళ్లీ మొదటికి వచ్చింది. గతేడాది బోడోలకు, బంగ్లాదేశీ వలసదారు ముస్లింలకు మద్య బోడోలాండ్ ప్రాంతంలో భారీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో దాదాపు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా మంది ఇప్పటికీ శరణార్థులుగా బతుకు వెళ్లదీస్తున్నారు. -
ఎవరికి ఓటేసినా, పడేది బిజెపికే
మీరు ఏ పార్టీకైనా ఓటేయండి. ఏ మీట నొక్కినా మీ ఓటు మాత్రం పడేది భారతీయ జనతా పార్టీ కే! ఇదేదో బిజెపి బెంగాల్ అభ్యర్థి పిసీ సర్కార్ మహేంద్ర జాలం కాదు. అసొం లోని జోర్హాట్ లోకసభ నియోజకవర్గంలో అధికారులు మాక్ పోల్ పరీక్ష నిర్వహించినప్పుడు ఈ వీ ఎంలు ఇలా వింతగా ప్రవర్తించాయి. ఈ తంతు అంతా అన్ని పార్టీల ఎంపీ అభ్యర్థుల సమక్షంలో జరిగింది. జోర్హాట్ నుంచి మాజీ కేంద్ర మంత్రి విజయ కృష్ణ హాండిక్, బిజెపి గిరిజన నేత కామాఖ్యా తాసాలు పోటీ పడుతున్నారు. ఈ ఈ వీఎంలు మన హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి ఈ మధ్యే జోర్హాట్ వచ్చాయి. వాటిని పరీక్షిస్తుండగా ఈ సంగతి బయటపడింది. ఈ ఈ వీఎంలు జిల్లా కమీషనర్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. అలా ఉంచినప్పుడు ఎవరైనా వీటిని ఇలా చేశారా అన్నది అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ దీనిపై ఫిర్యాదు చేసింది. ఒక్క జోర్హాట్ లోనే కాదు, రాష్ట్రమంతటా ఈవీఎంలను పరీక్షించాలని డిమాండ్ చేసింది. 'మేము కాంగ్రెస్ కి ఓటేసినా అది బిజెపి ఖాతాలోకే వెళ్తోంది,' అని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది. తమాషా ఏమిటంటే 2011 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదే చేసిందని, తమ ఓట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయని అసొంలో ప్రధాన ప్రతిపక్షం అసొం గణపరిషత్ అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే ఇవన్నీ నిరాధారమని, ఈవీఎం ఫలితాలను ఎవరూ తారుమారు చేయలేరని కాంగ్రెస్ వాదించింది. సుబ్రమణ్యం స్వామి వంటి నేతలు కూడా ఈవీఎం ఫలితాలను తారుమారు చేయవచ్చునని కోర్టుకెక్కారు. అప్పుడు కూడా కాంగ్రెస్ ఇదే వాదనను వినిపించింది. ఇప్పుడు తనదాకా వచ్చే సరికి మాత్రం కాంగ్రెస్ రాష్ట్రమంతటా పరీక్షించాలని డిమాండ్ చేస్తోంది.