
సోదాలు నిర్వహిస్తున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఉగ్రకదలికలపై నిఘా వర్గాల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిర్వహిసున్న సోదాలు మూడువ రోజుకు చేరుకున్నాయి. బుధవారం నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు వారిని విచారిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 20 మందిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హుమయున్ నగర్, షాహీన్ నగర్, పహాడీ షరీఫ్, బాలాపూర్‌లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడుల హెచ్చరిక నేపథ్యంలో ఎన్‌ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment