పాతబస్తీలో ఎన్‌ఐఏ అధికారుల దాడులు
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మరోసారి కలకలం రేగింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పాత హైదరాబాద్ నగరంలో సోదాలు నిర్వహించింది. స్థానిక పోలీసుల సాయంతో ఎన్‌ఐఏ అధికారులు అర్ధరాత్రి షాహీన్ నగర్, పహాడీ షరీఫ్ ప్రాంతాల్లో దాడులు చేశారు. గుజరాత్, కర్ణాటకకు చెందిన రెండు ఎన్‌ఐఏ బృందాలు అర్థరాత్రి నుంచి సోదాలు చేస్తూ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాయి. ఓ ఇంట్లోని ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఈ దాడుల విషయాన్ని స్థానిక పోలీసులు గోప్యంగా ఉంచారు. ఇంకా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రకదలికల నేపథ్యంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది.
ఐస్‌ఐస్ ఉగ్రవాద సంస్థ ఆదీనంలో పనిచేసే ఓ వాట్సాప్ నంబర్ ద్వారా దేశంలో ఉగ్రదాడుల యత్నం జరుగుతుందని గుర్తించిన ఇంటలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఆరుగురు అనుమానితులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎండీ అజీమ్ షాన్, ఎండీ ఒసమా అలియాస్ అదిల్ అలియస్ పీర్, అకాలకుర్ రెహ్మాన్ అలియాస్ అక్లక్, మహ్మద్ మెహ్‌రాజ్ అలియాస్ మోనూ, మోహ్‌సిన్ ఇబ్రహీం సయ్యద్, ముదాబ్బిర్ ముస్తాక్ షేక్‌లను అధికారులు జ్యూడీషియల్ కస్టడీకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment