హైదరాబాద్‌లో ఐసిస్ కలకలం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) జాడలు కనిపించడం కలకలం రేపింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శనివారం ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. టోలీచౌక్ ప్రాంతంలో అబ్దుల్ మాలిక్, ఫజులుల్లా, ఖయ్యూం అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల విషయమై ఈ ముగ్గురిని ఎన్‌ఐఏ అధికారులు ప్రస్తుతం విచారిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో వీరు ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. లక్నో నుంచి వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో ఉదయం టోలిచౌక్‌లోని వీరి నివాసంపై దాడులు చేసి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారి కార్యకలాపాలకు సహకరించడం వంటి చర్యలకు వీరు పాల్పడ్డట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న వారు.. ఉగ్రవాదులా కారా అనేది ఇంకా నిర్థారణకు రావాల్సి ఉందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు.