ఆకట్టుకుంటున్న అక్కీ హెయిర్ స్టయిల్! | Why is Akshay Kumar sporting the footballers' hairdo? | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న అక్కీ హెయిర్ స్టయిల్!

Published Thu, Apr 28 2016 3:46 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఆకట్టుకుంటున్న అక్కీ హెయిర్ స్టయిల్! - Sakshi

ఆకట్టుకుంటున్న అక్కీ హెయిర్ స్టయిల్!

ఇటీవల వినూత్న లుక్ లో అలరిస్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ కుమార్ స్పోర్ట్స్ హెయిర్ స్టయిల్ వెనుక రహస్యం ఏమిటి అంటే... అంతా ఆయన క్రీడాభిమాని అవటం వల్లేనట. అదొక్కటే అసలు కారణం కాదు. చిన్నపాటి క్రాఫ్ ను తిన్నగా పాపిడి తీసి దువ్వినట్లుగా కనిపిస్తున్నఆయన కొత్త హెయిర్ స్టయిల్ వెనుక క్రీడాభిమానంతోపాటు మరో కారణం కూడా ఉంది. అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఇప్పటికే ట్రయలర్ తో అభిమానులను అలరిస్తూ త్వరలో విడుదల కాబోతున్నఅక్షయ్ చిత్రం.. 'హౌస్ ఫుల్ 3' నేపథ్యంలోనిదే ఆయన క్రాప్ వెనుక కథ.  అక్షయ్... ఆ చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత ఫుడ్ బాల్ క్రీడాకారులు క్రిస్టియానో రోనాల్డో, సెర్జియో ఆగ్రో కేశాలంకరణను అనుకరించే కొత్త లుక్ లో ఆయన కనిపిస్తున్నారు.

క్రీడలపై తనకున్న ప్రేమ దాచేది కాదని... అది క్రికెట్, కరాటే, ఫుడ్బాల్ వంటివి ఏవైనా కావచ్చొని అక్షయ్ కుమార్ అంటున్నారు. అయితే వర్షాలు ఇతర అన్ని క్రీడలకు అడ్డంకిగా మారినా, ఫుడ్ బాల్ విషయంలో మాత్రం అటువంటి ఇబ్బంది ఎదురుకాదని, వర్షంలో కూడా ఎంతో ఎంజాయ్ చెయ్యగలిగే ఆటగా అక్షయ్ పేర్కొన్నారు. బంతిని ఒక్క తన్నుతన్ని కింద పడటం... బట్టలపై నీళ్ళుపడి మురికైపోవడం సాధారణంగా అందరికీ ఉండే మంచి  అనుభవమని, కొడుకు ఆరవ్, తాను రుతుపవనాలు వస్తే ఫుడ్ బాల్ ఆడాలని ఎదురు చూస్తుంటామని, ఎందుకంటే అది తమ ఇద్దరికీ ఎంతో ఇష్టమని అక్షయ్ తెలిపారు.

 ఇక 'హౌస్ ఫుల్ 3' విషయానికి వస్తే... ఆ సినిమాలో తాను ఫుడ్ బాల్ ప్లేయర్ అని, రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్ లతో సినిమా కోసం ఫుట్ బాల్ సరదాగా ఆడటం తనకెంతో సంతోషాన్నిచ్చిందని అక్షయ్ పేర్కొన్నారు. అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, నార్గిస్ ఫఖ్రి, లిసా హాయ్దోన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రముఖ తారాగణంగా నటిస్తున్న'హౌస్ ఫుల్ 3'  చిత్రం.. మూడు నిమిషాల ఫస్ట్ ట్రయలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 3న విడుదలకు సిద్ధమౌతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement