
చాన్సే లేదు... రజనీకాంత్ ‘2.0’కి పోటీగా అక్షయ్‌కుమార్ ‘ప్యాడ్‌మాన్’ వచ్చే చాన్సే లేదు. ఎందుకంటే... ‘నా సినిమాతో నేనెందుకు పోటీ పడతా?’ అనడుగుతున్నారు అక్షయ్! ‘2.0’ను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేస్తామని చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్ మ్యాన్’ను జనవరి 26న (అంటే ‘2.0’ విడుదల తర్వాతి రోజున) విడుదల చేస్తామని ఆ యూనిట్ ప్రకటించింది. ‘2.0’లో ఈ హిందీ హీరో యాంటీ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అదేంటి? విలన్‌గా నటించిన సిన్మాకి పోటీగా హీరోగా నటించిన సిన్మాను అక్షయ్ ఎలా విడుదల చేస్తానంటున్నారు? రెండు సినిమాల మధ్య క్లాష్ తప్పదా? అని అనుకున్నారంతా! ఇదే విషయాన్ని అక్షయ్ ముందుంచితే... ‘‘నా సినిమాకి పోటీగా నేను నటించిన మరో సినిమా రిలీజ్‌ను ఎందుకు ప్లాన్ చేస్తా?
నాకు తెలిసి... ఇప్పటివరకూ ‘2.0’ విడుదల తేదీ ఖరారు కాలేదు. ఒకవేళ రిపబ్లిక్ డే (జనవరి 26) నాడు ‘2.0’ను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటిస్తే, ‘ప్యాడ్‌మాన్’ను విడుదల చేయను’’ అని క్లారిటీ ఇచ్చారు. నిజం చెప్పాలంటే... అక్షయ్ అండ్ కో ‘ప్యాడ్‌మాన్’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 13న విడుదల చేయాలనుకున్నారు. ‘2.0’ వెనక్కి వెళ్తుందని తెలిసిందో ఏమో... విడుదల తేదీని జనవరికి జరిపారు. అక్షయ్ చెప్పిన మాటలను బట్టి ఒక్కటి స్పష్టమైంది. అయితే ‘2.0’... లేదంటే ‘ప్యాడ్‌మాన్’... రెండిటిలో ఏదో ఒక్క సినిమాయే జనవరిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది!!
Comments
Please login to add a commentAdd a comment