robo2.0
-
రజనీకి పోటీగానా... నో చాన్స్!
చాన్సే లేదు... రజనీకాంత్ ‘2.0’కి పోటీగా అక్షయ్‌కుమార్ ‘ప్యాడ్మాన్’ వచ్చే చాన్సే లేదు. ఎందుకంటే... ‘నా సినిమాతో నేనెందుకు పోటీ పడతా?’ అనడుగుతున్నారు అక్షయ్! ‘2.0’ను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేస్తామని చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్ మ్యాన్’ను జనవరి 26న (అంటే ‘2.0’ విడుదల తర్వాతి రోజున) విడుదల చేస్తామని ఆ యూనిట్ ప్రకటించింది. ‘2.0’లో ఈ హిందీ హీరో యాంటీ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అదేంటి? విలన్‌గా నటించిన సిన్మాకి పోటీగా హీరోగా నటించిన సిన్మాను అక్షయ్ ఎలా విడుదల చేస్తానంటున్నారు? రెండు సినిమాల మధ్య క్లాష్ తప్పదా? అని అనుకున్నారంతా! ఇదే విషయాన్ని అక్షయ్ ముందుంచితే... ‘‘నా సినిమాకి పోటీగా నేను నటించిన మరో సినిమా రిలీజ్‌ను ఎందుకు ప్లాన్ చేస్తా? నాకు తెలిసి... ఇప్పటివరకూ ‘2.0’ విడుదల తేదీ ఖరారు కాలేదు. ఒకవేళ రిపబ్లిక్ డే (జనవరి 26) నాడు ‘2.0’ను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటిస్తే, ‘ప్యాడ్మాన్’ను విడుదల చేయను’’ అని క్లారిటీ ఇచ్చారు. నిజం చెప్పాలంటే... అక్షయ్ అండ్ కో ‘ప్యాడ్మాన్’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 13న విడుదల చేయాలనుకున్నారు. ‘2.0’ వెనక్కి వెళ్తుందని తెలిసిందో ఏమో... విడుదల తేదీని జనవరికి జరిపారు. అక్షయ్ చెప్పిన మాటలను బట్టి ఒక్కటి స్పష్టమైంది. అయితే ‘2.0’... లేదంటే ‘ప్యాడ్మాన్’... రెండిటిలో ఏదో ఒక్క సినిమాయే జనవరిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది!! -
రోబో2.0 శాటిలైట్ రేటు ఎంతో తెలుసా...
ముంబై: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా రోబో 2.0. శంకర్, రజనీకాంత్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన రోబోకు సీక్వల్గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. విడుదలకు ముందే ఈ సినిమా పలు రికార్డులు సృష్టిస్తోంది.ఈ సినిమా శాటిలైట్ హక్కులకోసం పలు ముఖ్య టీవీ ఛానల్స్ పోటీపడగా జీటీవీ అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీ శాటిలైట్స్ హక్కులను రూ. 110 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా, అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న రోబో 2 అఫీషియల్ ట్రైలర్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అక్టోబర్ లో దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
2.0కి 100 రోజులు!
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘2.0’ సెంచరీ కొట్టేసింది. మామూలుగా రిలీజయ్యాక సినిమా బాగుంటేనే కదా సెంచరీ కొట్టేది. మరి.. ‘2.0’ విడుదల కాకుండానే ఎలా సెంచరీ కొట్టిందబ్బా అనుకుంటున్నారా? మరేం లేదు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి వంద రోజులు పూర్తయింది. ఈ విషయాన్ని శంకర్ స్వయంగా ప్రస్తావించారు. ‘‘2.0 వంద రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల్లో సినిమాకి కీలకంగా నిలిచే రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్, క్లైమ్యాక్స్ పూర్తి చేశాం. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ పాల్గొనగా ఈ చిత్రీకరణ జరిపాం. దీంతో 50 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని శంకర్ తెలిపారు. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్ ఆధ్వర్యంలో పోరాట దృశ్యాలు చిత్రీకరించారు. ఇంకా పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. -
వందరోజులు పూర్తి చేసుకున్నరోబో 2.0
రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న రోబో2.0 వంద రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో రెండు ప్రధాన యాక్షన్ సీన్లతో పాటు క్లైమాక్స్ ను తెరకెక్కించినట్లు దర్శకుడు శంకర్ తెలిపారు. విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ తోను, సూపర్‌స్టార్ రజనీకాంత్తోను క్లైమాక్స్ సీన్లు తీసినట్లు చెప్పాడు. ఈ వంద రోజుల ప్రయాణం చక్కగా సాగిందని వివరించారు. దాదాపు 50 శాతం సినిమా పూర్తయిందని తన ట్విట్టర్ అకౌంట్ లో ఆయన పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 16న ప్రారంభమైన రోబో 2.0 సినిమాను నిర్విరామంగా 100 రోజుల పాటు చిత్రీకరించారు. కాగా, మార్చి 21న అక్షయ్ రోబో 2.0 టీమ్ తో జాయిన్ అయ్యారు. ఏప్రిల్ లో హాలీవుడ్ యాక్షన్ ప్రొడ్యుసర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో ఢిల్లీలోని నెహ్రు స్టేడియంలో కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. 100th day of 2.o shoot. Ufff...finishd 2 major action sequncs including d climax with Superstar n Akshay.Loading 50% pic.twitter.com/y1A3TzVhUl — Shankar Shanmugham (@shankarshanmugh) 14 June 2016