
వందరోజులు పూర్తి చేసుకున్నరోబో 2.0
రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న రోబో2.0 వంద రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో రెండు ప్రధాన యాక్షన్ సీన్లతో పాటు క్లైమాక్స్ ను తెరకెక్కించినట్లు దర్శకుడు శంకర్ తెలిపారు. విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ తోను, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తోను క్లైమాక్స్ సీన్లు తీసినట్లు చెప్పాడు. ఈ వంద రోజుల ప్రయాణం చక్కగా సాగిందని వివరించారు.
దాదాపు 50 శాతం సినిమా పూర్తయిందని తన ట్విట్టర్ అకౌంట్ లో ఆయన పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 16న ప్రారంభమైన రోబో 2.0 సినిమాను నిర్విరామంగా 100 రోజుల పాటు చిత్రీకరించారు. కాగా, మార్చి 21న అక్షయ్ రోబో 2.0 టీమ్ తో జాయిన్ అయ్యారు. ఏప్రిల్ లో హాలీవుడ్ యాక్షన్ ప్రొడ్యుసర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో ఢిల్లీలోని నెహ్రు స్టేడియంలో కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు.
100th day of 2.o shoot. Ufff...finishd 2 major action sequncs including d climax with Superstar n Akshay.Loading 50% pic.twitter.com/y1A3TzVhUl
— Shankar Shanmugham (@shankarshanmugh) 14 June 2016