2.0కి 100 రోజులు! | Shankar's 2.0: 100 days of shoot finished | Sakshi
Sakshi News home page

2.0కి 100 రోజులు!

Published Thu, Jun 16 2016 10:39 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM

2.0కి 100 రోజులు! - Sakshi

2.0కి 100 రోజులు!

రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘2.0’ సెంచరీ కొట్టేసింది. మామూలుగా రిలీజయ్యాక సినిమా బాగుంటేనే కదా సెంచరీ కొట్టేది. మరి.. ‘2.0’ విడుదల కాకుండానే ఎలా సెంచరీ కొట్టిందబ్బా అనుకుంటున్నారా? మరేం లేదు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి వంద రోజులు పూర్తయింది. ఈ విషయాన్ని శంకర్ స్వయంగా ప్రస్తావించారు. ‘‘2.0 వంద రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల్లో సినిమాకి కీలకంగా నిలిచే రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్, క్లైమ్యాక్స్ పూర్తి చేశాం. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ పాల్గొనగా ఈ చిత్రీకరణ జరిపాం.

దీంతో 50 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని శంకర్ తెలిపారు. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్ ఆధ్వర్యంలో పోరాట దృశ్యాలు చిత్రీకరించారు. ఇంకా పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement