రోబో2.0 శాటిలైట్ రేటు ఎంతో తెలుసా...
ముంబై: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా రోబో 2.0. శంకర్, రజనీకాంత్ల కాంబినేషన్లో తెరకెక్కిన రోబోకు సీక్వల్గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. విడుదలకు ముందే ఈ సినిమా పలు రికార్డులు సృష్టిస్తోంది.ఈ సినిమా శాటిలైట్ హక్కులకోసం పలు ముఖ్య టీవీ ఛానల్స్ పోటీపడగా జీటీవీ అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీ శాటిలైట్స్ హక్కులను రూ. 110 కోట్లకు సొంతం చేసుకుంది.
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా, అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న రోబో 2 అఫీషియల్ ట్రైలర్ను ఈ ఏడాది సెప్టెంబర్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అక్టోబర్ లో దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.