
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.. ఈ సినిమా పేరు చెప్పగానే అద్భుతమైన సినిమా గుర్తొస్తుంది. తెలుగు సినిమా పోకడలు ఏం లేని క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ స్టోరీ తెగ నచ్చేస్తుంది. 12 ఏళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని.. మార్చి 7న రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఏముందంటే?
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. రేలంగా మామయ్య పాత్ర కోసం రజినీకాంత్ ని తీసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో కలిసి కథ కూడా వినిపించారు. స్టోరీ నచ్చి, తెలుగులో నటించే ఆసక్తి ఉన్నప్పటికీ అప్పుడు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రజనీకాంత్ సినిమాలో నటించలేకపోయారని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఇది 40 ఏళ్ల ప్రేమ.. ఉపాసన పోస్ట్ వైరల్)
స్టార్ హీరోలని సాధారణ వ్యక్తులుగా చూపెడుతున్నప్పుడు.. తండ్రి పాత్ర కోసం రజినీకాంత్ ని ఎందుకు తీసుకోకూడదనిపించింది. ఆయన నటించకపోయినా సరే కథ చెప్పానని ఆనందం తనకు ఉండిపోయిందని దర్శకుడు చెప్పాడు.
పెద్దోడు-చిన్నోడు పాత్రల్లో వెంకటేశ్, మహేశ్ బాబు నటించగా.. ఇతర పాత్రల్లో సమంత, అంజలి, జయసుధ తదితరులు నటించారు. రజినీకాంత్ మిస్ చేసుకున్న రేలంగి మామయ్య పాత్రని ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించి అందరికీ తెగ నచ్చేశాడు.
(ఇదీ చదవండి: ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా)
Comments
Please login to add a commentAdd a comment