సాక్షి, హైదరాబాద్: ఎ–3 డివిజన్ వన్డే క్రికెట్ లీగ్‌లో లక్కీ ఎలెవన్ బ్యాట్స్‌మన్ ఎస్. ధీరజ్ గౌడ్ (125 బంతుల్లో 201 నాటౌట్; 28 ఫోర్లు) అజేయ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. దీంతో ఆదివారం సత్యం కోల్ట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లక్కీ ఎలెవన్ జట్టు 238 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్కీ ఎలెవన్ 37 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 349 పరుగుల భారీ స్కోరును సాధించింది. ధీరజ్ డబుల్ సెంచరీకి తోడు మరో ఓపెనర్ హర్షిత్ (112) కూడా సెంచరీ చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు అజేయంగా 349 పరుగుల్ని జోడించారు. అనంతరం సత్యం కోల్ట్స్ జట్టును శశి (5/33)ధాటికి 26 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌటైంది.
మరో మ్యాచ్ వివరాలు: రోషనారా: 362/6 (శ్రీకాంత్ రెడ్డి 114 నాటౌట్, నయన్ 73), టీమ్‌కున్: 228/4 (సుక్రుత్ 89, ప్రజ్వల్ 40).