జంషెడ్‌పూర్: ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో మెగురైన ప్రదర్శన కనబర్చినా... పతకం సాధించలేకపోయిన ఈ ఆంధ్ర ఆర్చర్.. జాతీయ టోర్నీలో పెద్దగా పోటీ ఎదుర్కోకుండానే స్వర్ణం గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన రికర్వ్ సింగిల్స్ ఫైనల్లో ధీరజ్ 6–2తో హరియాణాకు చెందిన దివ్యాన్‡్ష చౌధరిపై విజయం సాధించాడు.
తొలి రెండు సెట్‌లలో వెనుకబడిన ధీరజ్ ఆ తర్వాత పుంజుకొని అదరగొట్టాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన అతుల్ వర్మ కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో నాలుగుసార్లు ఒలింపియన్ దీపికా కుమారి చాంపియన్‌గా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో తన సహచర ఆర్చర్ అకింత భకత్‌పై విజయంతో దీపికా కుమారి పసిడి పతకం కైవసం చేసుకుంది.
శుక్రవారం ఫైనల్లో దీపిక 6–2తో అంకితపై గెలిచింది. సిమ్రన్‌జీత్ కౌర్‌కు కాంస్యం దక్కింది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ దీపిక స్వర్ణం గెలిచింది. తన భర్త అతాను దాస్‌తో కలిసి పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) జట్టు తరఫున బరిలోకి దిగింది. ఫైనల్లో పీఎస్‌పీబీ 6–2తో పంజాబ్ టీమ్‌పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment