రాణించిన బషీరుద్దీన్ | basheeruddin gets century | Sakshi
Sakshi News home page

రాణించిన బషీరుద్దీన్

Published Tue, Nov 15 2016 11:26 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

basheeruddin gets century

సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో బాయ్స్ టౌన్ బ్యాట్స్‌మెన్ బషీరుద్దీన్ (103 బంతుల్లో 96; 13 ఫోర్లు, 1 సిక్సర్), జబల్ ఖాన్ (81 బంతుల్లో 56; 8 ఫోర్లు) రాణించారు. దీంతో సోమవారం సదరన్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాయ్స్ టౌన్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బాయ్స్ టౌన్ జట్టు 39.3 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. బషీరుద్దీన్ త్రుటిలో సెంచరీని చేజార్చుకోగా... జబల్ ఖాన్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో జ్యోతి స్వరూప్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 248 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సదరన్ స్టార్స్ జట్టు 42.4 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. సూర్య చంద్ర (68) ఒక్కడే రాణించాడు. బాయ్స్ టౌన్ బౌలర్లలో రహమాన్ మాజిద్ 3, ముస్తఫా ఖాన్, సమీయుద్దీన్ చెరో రెండు వికెట్లు తీశారు.

 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు:
  రాయల్ సీసీ: 222 (శివ శంకర్ 42, మహేశ్ 37 నాటౌట్; పాండే 2/33, సౌరవ్ 2/38), ఎంఎల్ జైసింహా: 91 (శివ శంకర్ 2/22, రాఘవ 6/34).   హెచ్‌సీఏ అకాడమీ: 356 (సాద్విక్ రెడ్డి 107, జిబిన్ 54, శ్రీనివాస్ 42; హిమాన్షు 5/32, లఖన్ 3/44), నోబుల్ సీసీ: 178 (మొహమ్మద్ షంశుద్దీన్ 102 నాటౌట్; నరేందర్ 5/28, శివ 5/32).

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement