చార్మినార్ సీసీ గెలుపు | charminar cc beats sporting eleven team | Sakshi
Sakshi News home page

చార్మినార్ సీసీ గెలుపు

Published Sat, Sep 10 2016 11:14 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

charminar cc beats sporting eleven team

సాక్షి, హైదరాబాద్: బౌలర్లు రాణించడంతో చార్మినార్ సీసీ జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఎ- డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్‌‌స 91పరుగుల తేడాతో స్పోర్టింగ్ ఎలెవన్ జట్టును ఓడించింది. తొలి ఇన్నింగ్‌‌సలో 143 పరుగులు చేసిన స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు రెండో ఇన్నింగ్‌‌సలో 27.3 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది.చార్మినార్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 4 వికెట్లతో రాణించాడు. అంతకుముందు చార్మినార్ సీసీ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 104 ఓవర్లలో 317 పరుగులు చేసింది.  

ఇతర మ్యాచ్‌ల వివరాలు
 ఇన్‌కం ట్యాక్స్: తొలి  ఇన్నింగ్స్ 467, రెండో ఇన్నింగ్స్ 207/2 (హరికాంత్ 57, హిమాన్షు 68, సందీప్ 40 నాటౌట్); జై హనుమాన్: 217 (సాకేత్ 65 నాటౌట్; హిమాన్షు 4/103).


 డెక్కన్‌క్రానికల్: తొలి  ఇన్నింగ్స్ 375; దయానంద్:  ఇన్నింగ్స్ 380/8 (కుషాల్ పర్వేజ్ 112, వంశీరెడ్డి 64; సీవీ మిలింద్ 4/64).

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement