charminar CC
-
చార్మినార్ సీసీ గెలుపు
సాక్షి, హైదరాబాద్: బౌలర్లు రాణించడంతో చార్మినార్ సీసీ జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఎ- డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స 91పరుగుల తేడాతో స్పోర్టింగ్ ఎలెవన్ జట్టును ఓడించింది. తొలి ఇన్నింగ్సలో 143 పరుగులు చేసిన స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు రెండో ఇన్నింగ్సలో 27.3 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది.చార్మినార్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 4 వికెట్లతో రాణించాడు. అంతకుముందు చార్మినార్ సీసీ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 104 ఓవర్లలో 317 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు ఇన్‌కం ట్యాక్స్: తొలి ఇన్నింగ్స్ 467, రెండో ఇన్నింగ్స్ 207/2 (హరికాంత్ 57, హిమాన్షు 68, సందీప్ 40 నాటౌట్); జై హనుమాన్: 217 (సాకేత్ 65 నాటౌట్; హిమాన్షు 4/103). డెక్కన్‌క్రానికల్: తొలి ఇన్నింగ్స్ 375; దయానంద్: ఇన్నింగ్స్ 380/8 (కుషాల్ పర్వేజ్ 112, వంశీరెడ్డి 64; సీవీ మిలింద్ 4/64). -
విజేత చార్మినార్ సీసీ
జింఖానా, న్యూస్‌లైన్: క్రికెట్ అకాడమీల సమాఖ్య (ఎఫ్సీఏ) నిర్వహించిన అండర్-12 టోర్నీలో చార్మినార్ సీసీ జట్టు విజేతగా నిలిచింది. సెయింట్ పీటర్స్‌తో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చార్మినార్ సీసీ జట్టు బ్యాట్స్‌మన్ అర్బాజ్ ఖాన్ (56) అర్ధ సెంచరీతో చెలరేగడంతో జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సెయింట్ పీటర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జట్టులో వికాస్ (56) అర్ధ సెంచరీతో రాణించగా, హర్షవర్ధన్ 32 పరుగులు చేశాడు. చార్మినార్ సీసీ బౌలర్ అబ్దుల్ అఖీబ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన చార్మినార్ సీసీ జట్టు 6 వికెట్లకు 150 పరుగులు చేసి గెలిచింది. అబ్దుల్ అఖీబ్ 31, జూనైద్ 18 పరుగులు చేశారు. సెయింట్ పీటర్స్ బౌలర్ హర్షవర్ధన్ రెడ్డి రెండు వికెట్లు చేజిక్కించుకున్నాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సెయింట్ పీటర్స్ 33 పరుగుల తేడాతో బ్రదర్స్ సీఏపై, చార్మినార్ సీసీ 6 వికెట్ల తేడాతో ఏఏసీఏపై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సంపాదించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ పురస్కారాన్ని సెయింట్ పీటర్స్ ఆటగాడు హర్షవర్ధన్ రెడ్డి (బ్యాటింగ్ 264, బౌలింగ్ 8 వికెట్లు) దక్కించుకున్నాడు. ‘బెస్ట్ బౌలర్’ అవార్డు చార్మినార్ సీసీ ఆటగాడు అద్నాన్ (17 వికెట్లు)కు లభించింది. ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’ పురస్కారం బ్రదర్స్ సీఏ (రెడ్) ఆటగాడు తిలక్ వర్మ (247 పరుగులు) కైవసం చేసుకున్నాడు. -
ముజీబ్ ఆల్‌రౌండ్ నైపుణ్యం
సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో చార్మినార్ సీసీ ఆటగాళ్లు దుమ్మురేపారు. ప్రసాద్ (131) సెంచరీకి తోడు ముజీబ్ (70; 3/28) ఆల్‌రౌండ్ నైపుణ్యం కనబర్చడంతో చార్మినార్ సీసీ 44 పరుగుల తేడాతో ఉస్మానియా విశ్వవిద్యాలయంపై విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన చార్మినార్ 286 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఓయూ జట్టు 242 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. పీఎన్ రాజు (69) టాప్ స్కోరర్. సంతోష్ (42), అభినవ్ (31) ఫర్వాలేదనిపించారు. ముజీబ్, యూనిస్‌లు చెరో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. మరో మ్యాచ్‌లో నిజాం బౌలర్ వెంకటేశ్ (5/34) ధాటికి సుల్తాన్ షాహి విలవిల్లాడింది. దీంతో నిజాం కాలేజి 37 పరుగుల తేడాతో సుల్తాన్షాహిపై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నిజాం కాలేజి 196 పరుగులు చేయగా.. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సుల్తాన్ షాహి 159 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు పీ అండ్ టీ కాలనీ: 209; విశాఖ: 210/8 (రాకేశ్ 57, ప్రసాద్ 39, మజీద్ 42 నాటౌట్, తాఖిఖుల్లా 4/25). ఎస్బీఐ: 353/7; బడ్డింగ్‌స్టార్: 277/4 (గిరీష్ 46, నిఖిల్ 57, మనీష్ 56 నాటౌట్, నిఖిల్ యాదవ్ 87 నాటౌట్). సీసీఓబీ: 225 (నఫీజ్ 61); గౌడ్స్ ఎలెవన్: 226/7 (హరీష్ 70 నాటౌట్, రాధాకృష్ణ 37 నాటౌట్, ఖురేషి 4/84). కేంబ్రిడ్జ్ ఎలెవన్: 489/9; తెలంగాణ: 137 (జయసూర్య 50, కమ్రాన్ ఖాన్ 6/37, సన్నీ పాస్తా 3/49). మెగాసిటీ: 327; హైదరాబాద్ టైటాన్స్: 138 (అభిషేక్ 70, నితీష్ 6/40). గుజరాతీ: 295; జెమిని ఫ్రెండ్స్: 298/8 (చంద్రశేఖర్ 73, గణేశ్ 89, షకీల్ 40 నాటౌట్, పర్వత్ సింగ్ 38, అఫ్జల్ 5/76). వీనస్ సైబర్‌టెక్: 386 (నరేశ్ కుమార్ 109, వంశీ 36, యేసుదాస్ 46, తరణ్ 66, ప్రతీక్ 5/65); సాయి సత్య: 176 (మికిల్ 92, విజయ్ 6/70). కోసరాజ్: 364/8 (లోహిత్ 94, చరణ్ 174); సలీంనగర్: 295 (జమీరుద్దీన్ 103, జాఫర్ 53, చరణ్ 4/74, లోహిత్ 4/38). విజయ్ హనుమాన్: 224 (ఒమర్ 37, రోహన్ 42); బాలాజీ కోల్ట్స్‌తో మ్యాచ్.