సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో చార్మినార్ సీసీ ఆటగాళ్లు దుమ్మురేపారు. ప్రసాద్ (131) సెంచరీకి తోడు ముజీబ్ (70; 3/28) ఆల్‌రౌండ్ నైపుణ్యం కనబర్చడంతో చార్మినార్ సీసీ 44 పరుగుల తేడాతో ఉస్మానియా విశ్వవిద్యాలయంపై విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన చార్మినార్ 286 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఓయూ జట్టు 242 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. పీఎన్ రాజు (69) టాప్ స్కోరర్.
సంతోష్ (42), అభినవ్ (31) ఫర్వాలేదనిపించారు. ముజీబ్, యూనిస్‌లు చెరో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. మరో మ్యాచ్‌లో నిజాం బౌలర్ వెంకటేశ్ (5/34) ధాటికి సుల్తాన్ షాహి విలవిల్లాడింది. దీంతో నిజాం కాలేజి 37 పరుగుల తేడాతో సుల్తాన్‌షాహిపై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నిజాం కాలేజి 196 పరుగులు చేయగా.. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సుల్తాన్ షాహి 159 పరుగులకే కుప్పకూలింది.
ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు
పీ అండ్ టీ కాలనీ: 209; విశాఖ: 210/8 (రాకేశ్ 57, ప్రసాద్ 39, మజీద్ 42 నాటౌట్, తాఖిఖుల్లా 4/25).
ఎస్‌బీఐ: 353/7; బడ్డింగ్‌స్టార్: 277/4 (గిరీష్ 46, నిఖిల్ 57, మనీష్ 56 నాటౌట్, నిఖిల్ యాదవ్ 87 నాటౌట్).
సీసీఓబీ: 225 (నఫీజ్ 61); గౌడ్స్ ఎలెవన్: 226/7 (హరీష్ 70 నాటౌట్, రాధాకృష్ణ 37 నాటౌట్, ఖురేషి 4/84).
కేంబ్రిడ్జ్ ఎలెవన్: 489/9; తెలంగాణ: 137 (జయసూర్య 50, కమ్రాన్ ఖాన్ 6/37, సన్నీ పాస్తా 3/49).
మెగాసిటీ: 327; హైదరాబాద్ టైటాన్స్: 138 (అభిషేక్ 70, నితీష్ 6/40).
గుజరాతీ: 295; జెమిని ఫ్రెండ్స్: 298/8 (చంద్రశేఖర్ 73, గణేశ్ 89, షకీల్ 40 నాటౌట్, పర్వత్ సింగ్ 38, అఫ్జల్ 5/76).
వీనస్ సైబర్‌టెక్: 386 (నరేశ్ కుమార్ 109, వంశీ 36, యేసుదాస్ 46, తరణ్ 66, ప్రతీక్ 5/65); సాయి సత్య: 176 (మికిల్ 92, విజయ్ 6/70).
కోసరాజ్: 364/8 (లోహిత్ 94, చరణ్ 174); సలీంనగర్: 295 (జమీరుద్దీన్ 103, జాఫర్ 53, చరణ్ 4/74, లోహిత్ 4/38).
విజయ్ హనుమాన్: 224 (ఒమర్ 37, రోహన్ 42); బాలాజీ కోల్ట్స్‌తో మ్యాచ్.
ముజీబ్ ఆల్‌రౌండ్ నైపుణ్యం
Published Wed, Sep 4 2013 12:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement