All round performance
-
KKR vs GT: రసెల్ చెలరేగినా... ఓటమి తప్పలేదు
ముంబై: బౌలింగ్‌లో వేసింది ఒకే ఓవర్.. అదీ ఇన్నింగ్స్‌లో చివరిది... చక్కటి నియంత్రణతో బౌలింగ్ చేస్తూ 5 పరుగులే ఇచ్చిన అతను ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు... బ్యాటింగ్‌లో 25 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు... ఆండ్రీ రసెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇది! అయితే ఇది కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను గెలిపించేందుకు సరిపోలేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 8 పరుగుల తేడాతో నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (49 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా మూడో అర్ధ సెంచరీ సాధించాడు. ఆండ్రీ రసెల్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులే చేయగలిగింది. ఆండ్రీ రసెల్ టాప్ స్కోరర్‌గా నిలవగా, రింకూ సింగ్ (28 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (2/22) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇది 35వ మ్యాచ్ కాగా...టాస్ గెలిచిన కెప్టెన్ తొలిసారి బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం. గత 34 మ్యాచ్‌లలో టాస్ గెలవగానే అన్ని జట్లు ఫీల్డింగ్‌నే తీసుకున్నాయి. గిల్ (7) మళ్లీ విఫలం కాగా, సాహా (25 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు. ఈ స్థితిలో కెప్టెన్ ఇన్నింగ్స్‌తోనే గుజరాత్ కోలుకుంది. 36 బంతుల్లో హార్దిక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మిల్లర్ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతనికి సహకరించాడు. అయితే 18 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయిన టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. చివరి ఓవర్ వేసిన రసెల్... అభినవ్ మనోహర్, ఫెర్గూసన్, తెవాటియా, యష్ దయాళ్ వికెట్లు తీశాడు. ఛేదనలో కోల్‌కతా పూర్తిగా తడబడింది. 6.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయిన జట్టు కోలుకోవడం కష్టంగా మారింది. బిల్లింగ్స్ (4), నరైన్ (5), రాణా (2), శ్రేయస్ (12) విఫలమయ్యారు. 47 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన రసెల్ వరుస సిక్సర్లతో చెలరేగి కోల్‌కతా విజయావకాశాలు పెంచాడు. అల్జారి చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతినే అతను సిక్సర్‌గా మలచడంతో కేకేఆర్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే తర్వాతి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రసెల్ అవుటయ్యాడు. -
45 ఏళ్ల వయసులో ఏమా విధ్వంసం.. 15 ఫోర్లు, 15 సిక్సర్లు
లండన్: కౌంటీ క్రికెట్లో కెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న 45 ఏళ్ల ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ డారెన్ స్టీవెన్స్ బౌండరీలు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. టాలెంట్‌కు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించాడు. శుక్రవారం గ్లామోర్గన్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 బంతుల్లో 15 బౌండరీలు, 15 సిక్సర్ల సాయంతో 128 స్ట్రయిక్ రేట్‌తో 190 పరుగులు సాధించాడు. లేటు వయసులో స్టీవెన్స్ చేసిన విధ్వంసాన్ని చూసిన యువ క్రికెటర్లు ముక్కున వేలేసుకున్నారు. Enjoy EVERY boundary from Darren Stevens' 190 😍 Watch him bowl LIVE: https://t.co/4ZkDAI69AU#LVCountyChamp pic.twitter.com/rgKdT0GtaT — LV= Insurance County Championship (@CountyChamp) May 21, 2021 ఇంతటితో ఆగని స్టీవెన్స్ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఆసీస్ స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్‌ను ఎల్బీడబ్యూ చేసి వయసు మీదపడినా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని, యువ బ్యాట్స్మెన్లకు సవాల్ విసిరాడు. ఇదిలా ఉంటే, 315 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన స్టీవెన్స్ 15940 పరుగులతో పాటు 565 వికెట్లు సాధించాడు. అతనికిది 36వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కెంట్.. స్టీవెన్స్ అద్భుత ఇన్నింగ్స్ సహకారంతో 307 పరుగులు స్కోర్ చేయగలిగింది. Of course he's just dismissed Marnus Labuschagne for the second time this season Reminder: Darren Stevens is 45!!! 🤯 Watch Now: https://t.co/4ZkDAI69AU pic.twitter.com/Zab35CrmLb — LV= Insurance County Championship (@CountyChamp) May 21, 2021 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్టీవెన్స్ ఆదుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు 36 పరుగులు, తొమ్మిదో వికెట్‌కు 166 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. అనంతరం బౌలింగ్‌లో లబూషేన్‌ను ఔట్ చేసి ప్రత్యర్ధిని కోలుకోలుని దెబ్బతీశాడు. రెండు రోజు ఆట ముగిసే సమయానికి గ్లామోర్గన్ 2 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. చదవండి: సలాం సాహా.. నిజమైన ప్రొఫెషనలిజం చూపించావు -
ఇంగ్లండ్... ఇప్పుడైనా!
జెంటిల్మన్ క్రీడకు పుట్టిల్లు...వన్డే ప్రపంచ కప్ పురుడు పోసుకున్న నేల.. క్రికెట్ మక్కా ‘లార్డ్స్’ మైదానం కొలువైనదీ అక్కడే! అయినా, ఇంగ్లండ్‌కు ప్రపంచ కప్ తీరని కలే! మూడుసార్లు ఫైనల్ వరకు వచ్చినా కిరీటం అందినట్టే అంది చేజారింది. ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం దుర్బేధ్య బ్యాటింగ్ లైనప్, అందుకుతగ్గ బౌలింగ్ బలగం, నాణ్యమైన ఆల్ రౌండర్లతో ఆతిథ్య దేశం అత్యంత బలంగా ఉంది.ప్రత్యర్థులకు దడ పుట్టించే ఆటతో ఎన్నడూ లేనంత ధీమాగా బరిలో దిగుతోంది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఈ జట్టుకు ‘విపరీతమైన అంచనాల ఒత్తిడి’ ప్రధాన ముప్పు. ఆ ఒక్కదాన్నీ అధిగమిస్తే చిరకాల వాంఛ నెరవేరినట్లే! సాక్షి క్రీడా విభాగం: వన్డేల్లో నంబర్‌వన్, హాట్ ఫేవరెట్, ఆతిథ్యం... బహుశా ఇన్ని సానుకూలతలతో ఇంగ్లండ్ ఎప్పుడూ ప్రపంచ కప్ బరిలో దిగి ఉండకపోవచ్చు. చుట్టూ సానుకూల వాతావరణంలో మోర్గాన్ సేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. వన్డేల్లో నమోదైన చివరి 400పైగా స్కోర్లలో నాలుగు ఇంగ్లండ్వే అంటేనే ఆ జట్టు భీకర ఫామ్‌ను అర్థం చేసుకోవచ్చు. విధ్వంసక బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్ దూరమైనా... ఒక్క శాతం కూడా బలహీనపడ్డట్లు కనిపించకపోవడమే ఆతిథ్య దేశం ఎంత పటిష్టంగా ఉందో తెలుపుతోంది. అయితే, దీని వెనుక నాలుగేళ్ల సంస్కరణల కృషి ఉంది. గత కప్‌లో దారుణ వైఫల్యంతో గ్రూప్ దశలోనే వెనుదిరగడం వారి కళ్లు తెరిపించింది. కొందరు ఆటగాళ్లనూ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి... ఆద్యంతం దూకుడు కనబరిచేవారిని ఎంచుకోవడం మంచి ఫలితాన్నిచ్చింది. ఈ ప్రయోగాలన్నీ విజయవంతమైనట్లు ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా తే లింది. మరి ప్రపంచకప్‌లో ఏమౌతుందో చూడాలి. ఆతిథ్యం ఐదోసారి... ప్రపంచ కప్‌కు అత్యధికంగా ఐదోసారి ఆతిథ్యం ఇస్తోంది ఇంగ్లండ్. ఇక్కడే జరిగిన 1975 కప్‌లో సెమీస్‌కు, 1979లో ఫైనల్‌కు, 1983లో సెమీస్‌కు చేరింది. తర్వాతి రెండు కప్‌ల (1987, 1992)లో రన్నరప్‌గా నిలిచింది. మెగా టోర్నీలో ఇక్కడి నుంచి జట్టు ప్రదర్శన పడిపోయింది. భారత్ ఆతిథ్యమిచ్చిన 1996 కప్‌లో క్వార్టర్స్ వరకు చేరగలిగినా... సొంతగడ్డపై జరిగిన 1999 కప్‌లో గ్రూప్ దశ కూడా దాటలేదు. 2003లో గ్రూప్, 2007లో సూపర్–8, 2011లో క్వార్టర్స్, 2015లో గ్రూప్ దశతోనే సరిపెట్టుకుంది. బలాలు జేసన్ రాయ్, బెయిర్‌స్టో, జో రూట్ల టాపార్డర్... కెప్టెన్ మోర్గాన్, జాస్ బట్లర్, పేస్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో కూడిన బ్యాటింగ్ లైనపే ఇంగ్లండ్ బలం. స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. జట్టు గెలిచిన కొన్ని సిరీస్‌లను చూస్తే... భారత్‌పై రూట్, బెయిర్‌స్టో, శ్రీలంకపై మోర్గాన్, బట్లర్ ఇలా ఇద్దరేసి బ్యాట్స్‌మెన్ కీలక పాత్ర పోషించారు. మిగతావారు విజయానికి కావాల్సిన ముగింపు ఇచ్చారు. రాయ్, బెయిర్‌స్టో విధ్వంసక ఆరంభాన్నిస్తే... రూట్, మోర్గాన్ మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్‌ను నడిపిస్తారు. తర్వాత సంగతిని ఫటాఫట్ షాట్లతో బట్లర్ చూసుకుంటాడు. రెండేళ్లుగా బీభత్సమైన ఫామ్‌లో ఉన్న అతడు ఇటీవల పాకిస్తాన్‌తో సిరీస్‌లో 50 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై 77 బంతుల్లో 150 మార్క్‌ను అందుకున్నాడు. బౌండరీలతో చకచకా పరుగులు రాబడుతూ సెంచరీలపై సెంచరీలతో బెయిర్‌స్టో ఏడాదిన్నరగా నిలకడకు మారుపేరుగా నిలుస్తున్నాడు. తాజాగా ఐపీఎల్‌లోనూ రాణించాడు. రషీద్, అలీలతో స్పిన్ వైవిధ్యంగా కనిపిస్తోంది. నిరుడు తమ దేశంలో పర్యటించిన ఆస్ట్రేలియా, భారత్‌లకు వీరి నుంచే పెద్ద సవాలు ఎదురైంది. ముఖ్యంగా రషీద్... లంక, వెస్టిండీస్‌లోనూ వికెట్లు తీశాడు. గత కప్‌నకు ముందు అనూహ్యంగా పగ్గాలు చేపట్టిన మోర్గాన్... ఈసారి సారథిగా, బ్యాట్స్‌మన్‌గా పరిణతి సాధించాడు. వీరందరి తోడుగా భారీ లక్ష్యాలను విధిస్తున్న ఇంగ్లండ్, అంతే తేలిగ్గా పెద్ద స్కోర్లనూ ఛేదిస్తోంది. బలహీనతలు నిఖార్సైన పేసర్ లేకపోవడం ఇంగ్లండ్ లోటు. క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ ప్రత్యర్థులను కట్టిపడేసేంత స్థాయి ఉన్నవారు కాదు. అందుకే మంచి లయతో బంతులేసే జోఫ్రా ఆర్చర్‌ను తీసుకున్నారు. స్టోక్స్ బౌలింగ్ కూడా ప్రభావవం తంగా లేదు. దీనికితోడు గాయాల బెడద. కెప్టెన్ మోర్గాన్ వేలికి దెబ్బ తగలడంతో ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు. ఇదే మ్యాచ్‌లో వుడ్ ఎడమ కాలు ఇబ్బంది పెట్టడంతో స్కానింగ్‌కు వెళ్లాడు. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆర్చర్ ఆ వెంటనే బంతిని ఆపే యత్నంలో తడబడి మైదానం వీడాడు. ఎడంచేతి స్పిన్నర్ లియామ్ డాసన్ వేలి గాయం, రషీద్ భుజం నొప్పి, వోక్స్ మోకాలి సమస్యలు సైతం జట్టును కలవరపెట్టేవే. బహుళ దేశాల ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఒత్తిడి పెద్ద శత్రువు. ఈ ప్రభావం సొంత గడ్డపై ఇంగ్లండ్‌కు మరింత ఎక్కువ. రెండేళ్ల క్రితం తమ దగ్గరే వన్డే ఫార్మాట్లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో దాదాపు ఇదే జట్టు ఆడినా ఫైనల్ చేరడంలో విఫలమైన సంగతి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. -
ముజీబ్ ఆల్‌రౌండ్ నైపుణ్యం
సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో చార్మినార్ సీసీ ఆటగాళ్లు దుమ్మురేపారు. ప్రసాద్ (131) సెంచరీకి తోడు ముజీబ్ (70; 3/28) ఆల్‌రౌండ్ నైపుణ్యం కనబర్చడంతో చార్మినార్ సీసీ 44 పరుగుల తేడాతో ఉస్మానియా విశ్వవిద్యాలయంపై విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన చార్మినార్ 286 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఓయూ జట్టు 242 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. పీఎన్ రాజు (69) టాప్ స్కోరర్. సంతోష్ (42), అభినవ్ (31) ఫర్వాలేదనిపించారు. ముజీబ్, యూనిస్‌లు చెరో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. మరో మ్యాచ్‌లో నిజాం బౌలర్ వెంకటేశ్ (5/34) ధాటికి సుల్తాన్ షాహి విలవిల్లాడింది. దీంతో నిజాం కాలేజి 37 పరుగుల తేడాతో సుల్తాన్షాహిపై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నిజాం కాలేజి 196 పరుగులు చేయగా.. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సుల్తాన్ షాహి 159 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు పీ అండ్ టీ కాలనీ: 209; విశాఖ: 210/8 (రాకేశ్ 57, ప్రసాద్ 39, మజీద్ 42 నాటౌట్, తాఖిఖుల్లా 4/25). ఎస్బీఐ: 353/7; బడ్డింగ్‌స్టార్: 277/4 (గిరీష్ 46, నిఖిల్ 57, మనీష్ 56 నాటౌట్, నిఖిల్ యాదవ్ 87 నాటౌట్). సీసీఓబీ: 225 (నఫీజ్ 61); గౌడ్స్ ఎలెవన్: 226/7 (హరీష్ 70 నాటౌట్, రాధాకృష్ణ 37 నాటౌట్, ఖురేషి 4/84). కేంబ్రిడ్జ్ ఎలెవన్: 489/9; తెలంగాణ: 137 (జయసూర్య 50, కమ్రాన్ ఖాన్ 6/37, సన్నీ పాస్తా 3/49). మెగాసిటీ: 327; హైదరాబాద్ టైటాన్స్: 138 (అభిషేక్ 70, నితీష్ 6/40). గుజరాతీ: 295; జెమిని ఫ్రెండ్స్: 298/8 (చంద్రశేఖర్ 73, గణేశ్ 89, షకీల్ 40 నాటౌట్, పర్వత్ సింగ్ 38, అఫ్జల్ 5/76). వీనస్ సైబర్‌టెక్: 386 (నరేశ్ కుమార్ 109, వంశీ 36, యేసుదాస్ 46, తరణ్ 66, ప్రతీక్ 5/65); సాయి సత్య: 176 (మికిల్ 92, విజయ్ 6/70). కోసరాజ్: 364/8 (లోహిత్ 94, చరణ్ 174); సలీంనగర్: 295 (జమీరుద్దీన్ 103, జాఫర్ 53, చరణ్ 4/74, లోహిత్ 4/38). విజయ్ హనుమాన్: 224 (ఒమర్ 37, రోహన్ 42); బాలాజీ కోల్ట్స్‌తో మ్యాచ్.