సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఆంధ్రాబ్యాంక్ ఆటగాడు అమోల్ షిండే (7/77, 81) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. దీంతో ఎన్‌సకాన్‌స జట్టు పరాజయం దిశగా పయనిస్తోంది. రెండో రోజు 148/5 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట ప్రారంభించిన ఎన్‌సకాన్‌స తొలి ఇన్నింగ్‌సలో 195 పరుగుల వద్ద ఆలౌటైంది. మెహదీ హసన్ (65) రాణించాడు. అమోల్ షిండే ఏడు వికెట్లు తీశాడు. దీంతో ఆంధ్రాబ్యాంక్‌కు 9 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్‌స ఆడిన ఆంధ్రాబ్యాంక్ 191 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఒక దశలో ప్రత్యర్థి బౌలర్ ముదాసిర్ హుస్సేన్ (7/63) ధాటికి తడబడిన ఆంధ్రాబ్యాంక్‌ను షిండే (81) బ్యాటింగ్‌లోనూ రాణించి ఆదుకున్నాడు. దీంతో ఎన్‌సకాన్‌స ముందు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎన్‌సకాన్‌స రెండో ఇన్నింగ్‌సలో ఆట నిలిచే సమాయానికి 5 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. కనిష్క్ నాయుడికి 3 వికెట్లు దక్కాయి.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్‌స: 110 (సారుు కీర్త్ 47; విశాల్ శర్మ 6/42, ఆకాశ్ భండారి 3/42), ఎస్‌బీహెచ్ తొలి ఇన్నింగ్‌స: 220/2 (డాని డెరిక్ ప్రిన్‌స 84, కేఎస్‌కే చైతన్య 77).
డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్‌స: 276/7 (మిలింద్ 97 బ్యాటింగ్, షాదాబ్ 57; శ్రీచరణ్ 4/107), ఆర్.దయానంద్‌తో మ్యాచ్.
స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్‌స: 143/9 డిక్లేర్డ్ (మాన్‌సింగ్ రమేశ్ 40, యతిన్ 30; సిరాజ్ 4/27), చార్మినార్ తొలి ఇన్నింగ్‌స: 117/4 (సారుు ప్రజ్ఞయ్ రెడ్డి 48).
ఇన్‌కమ్ ట్యాక్స్ తొలి ఇన్నింగ్‌స: 331/7 (వంశీవర్ధన్ రెడ్డి 91 బ్యాటింగ్, అక్షత్ రెడ్డి 64, హబీబ్ అహ్మద్ 45, హర్షవర్ధన్ నాయుడు 47; తేజ 3/22), జైహనుమాన్‌తో మ్యాచ్.