సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో అబ్దుల్ యూసుఫ్ (50), దేవేశ్ (48), బౌలింగ్‌లో ఆర్యన్ (5/65) రాణించడంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో షాలిమార్ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. సోమవారం ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన షాలిమార్ సీసీ 47.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. యూసుఫ్ అర్ధసెంచరీ చేయగా.. ఖుర్షీద్ (31) రాణించారు. ఇంటర్నేషనల్ సీసీ బౌలర్లలో సొహైల్ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఇంటర్నేషనల్ సీసీ 26.4 ఓవర్లలో 141 పరుగులకే అలౌటైంది. ఆర్యన్ 5వికెట్లు, ఖుర్షీద్ 3 వికెట్లు పడగొట్టారు.
మరో మ్యాచ్‌లో సూపర్‌స్టార్ క్రికెట్‌క్లబ్ 84 పరుగుల తేడాతో నోబుల్ క్రికెట్ క్లబ్‌పై గెలుపొందింది. కులీకుతుబ్ షా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్‌స్టార్ జట్టు 47.3 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. సాయి కృష్ణ (57) అర్ధసెంచరీ చేశాడు. నోబుల్ బౌలర్లలో హిమాన్షు 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం నోబుల్ క్రికెట్ క్లబ్ 37 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. షంషుద్దీన్ (51), లఖన్ (51), అనిరుధ్ (30) రాణించారు. సూపర్‌స్టార్ బౌలర్లలో సంతోష్ 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు.