హడలెత్తించిన శేషగిరి | seshagiri 7 wickets helps to big victory succ | Sakshi
Sakshi News home page

హడలెత్తించిన శేషగిరి

Published Thu, Oct 13 2016 10:49 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

seshagiri 7 wickets helps to big victory succ

సాక్షి, హైదరాబాద్: ఎస్యూసీసీ బౌలర్ శేషగిరి (7/10) చెలరేగాడు. సదర్న్ స్టార్స్ బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించాడు. దీంతో ఎస్యూసీసీ 225 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఎస్యూసీసీ 41 ఓవర్లలో 9 వికెట్లకు 251 పరుగులు చేసింది. చరణ్ తేజ (105 నాటౌట్) సెంచరీ సాధించగా, రాజ్ (53) రాణించాడు. తర్వాత సదర్న్ స్టార్స్ అనూహ్యంగా 26 పరుగులకే కుప్పకూలింది. శేషగిరి ధాటికి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఎవరూ నిలువలేకపోయారు.

 ఇతర మ్యాచ్ ల స్కోర్లు

ఆర్జేసీసీ: 291/9 (అవినాశ్ 51, పృథ్వీ 60, నాగార్జున 40), ఎంపీ యంగ్మన్:178 (సందీప్ 36, నితిన్ 35; కిరణ్ 5/16).
యాదవ్ డెయిరీ: 249/6 (సాయివరుణ్ 107, సాకేత్ 53; సురేశ్ 3/43), స్టార్లెట్స్: 118 (సురేశ్ 44).
  ఆల్ సెయింట్స్: 214/3 (సాత్విక్ రెడ్డి 111, శివ 66; రాఘవ 3/84), రాయల్ సీసీ: 217/4 (నీరజ్ కుమార్ 113 నాటౌట్, నాగ్ 35).
  సీకే బ్లూస్: 347 (సుశాంత్ 110, బి.సారుు సుశాంత్ 81, బాలకృష్ణ 56 నాటౌట్; రుత్విక్ యాదవ్ 6/57, తేజస్ 3/22), సఫిల్గూడ: 93 (రుత్విక్ యాదవ్ 31; అశ్వద్ 6/18, ప్రతీక్ 3/14).


  అక్షిత్ సీసీ: 242 (భరద్వాజ్ 59, రోనక్ 60, రిలాస 3/69, సాత్విక్ అగర్వాల్ 4/57), సత్యం కోల్ట్స్: 96 (రిత్విక్ 5/7).
  రాజు సీఏ: 194 (అభినవ్ 66, పునీత్ 50; సంతోష్ 4/22), రంగారెడ్డి జిల్లా: 109 (వర్షిత్ 30; కౌశిక్ 6/33).
  ఆడమ్స్ ఎలెవన్: 251/5 (సచిన్ కుమార్ 101, జయంత్ 80), పీఎన్ యంగ్స్టర్స్: 252/7 (శ్రీకాంత్ 96, నరసింహా 51; దుర్గేశ్ 3/46).
  యంగ్ సిటీజన్: 142 (పృథ్వి 38, సారుు 34; జిబిన్ 5/15), హెచ్సీఏ అకాడమీ: 145/2 (సతీశ్ 56 నాటౌట్, శ్రీనివాస్ 50 నాటౌట్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement