ఫ్యూచర్ స్టార్ 350/9 డిక్లేర్డ్ | future star 350/9 declared | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్ స్టార్ 350/9 డిక్లేర్డ్

Published Fri, Nov 4 2016 11:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

future star 350/9 declared

సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మెన్ వికాస్ రావు (198 బంతుల్లో 159 నాటౌట్; 19 ఫోర్లు), అనిల్ కుమార్ (85) రాణించడంతో ఫ్యూచర్ స్టార్ జట్టు తొలిరోజు భారీ స్కోరు సాధించింది. ఎ- డివిజన్ టూ డే (ప్లేట్) లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా డబ్ల్యుఎంసీసీతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 71. 4 ఓవర్లలో 9 వికెట్లకు 350 పరుగులు చేసి ఇన్నింగ్‌‌సను డిక్లేర్ చేసింది. వికాస్ రావు, అనిల్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆర్. యశ్వంత్ (33) రాణించాడు.

ప్రత్యర్థి బౌలర్లలో జీఆర్ యశ్వంత్ 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డబ్ల్యుఎంసీసీ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో 4 వికెట్లకు 54 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు: ఎలిగెంట్: 105 (రంగనాథ్ 4/34, బాలరాజు 3/16), రెండో ఇన్నింగ్స్: 31/1 (7 ఓవర్లలో), హెచ్‌యూసీసీ: 154/9 డిక్లేర్డ్ (బి. బాలరాజు 41, సాయి రేవంత్ 58; ఆదిత్య 3/13).

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement