future star
-
భారత క్రికెట్‌కు ఫ్యూచర్ స్టార్ అతడే!
సాక్షి, ముంబై: రిషభ్ పంత్ ఎదగడానికి ఎక్కువ అవకాశాలివ్వాలని, అతడు భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణమని ముంబై ఇండియన్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ అన్నారు. ఐపీఎల్లో ఆదివారం జరిగినన ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు రిషభ్ పంత్ 27 బంతుల్లో 78 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో యువరాజ్ మాట్లాడుతూ.. పంత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘పంత్‌లో అద్భుత ప్రతిభ దాగుంది. ఎదిగేందుకు సరైన అవకాశాలిస్తే అతడు భారత క్రికెట్‌కు ఫ్యూచర్ స్టార్ అవుతాడ’ని యువీ అన్నారు. ప్రపంచ కప్ ఎంపిక గురించి తాను చెప్పలేనని, కానీ పంత్ ప్రస్తుత ప్రదర్శన మాత్రం సూపర్‌గా ఉందని యువీ పేర్కొన్నారు. 21 ఏళ్ల వయసులో విదేశాల్లో రెండు శతకాలు బాదడం పంత్ టాలెంట్‌కు నిదర్శనమని 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ ప్రశంసించారు. ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఓటమిపై స్పందించిన యువీ.. రోహిత్ శర్మ త్వరగా ఔటవడం తమ అవకాశాల్ని దెబ్బతీసిందని.. డికాక్, పొలార్డ్‌లు తమకు లభించిన ఆరంభాల్ని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారని, సరైన భాగస్వామ్యాల్ని నెలకొల్పలేకపోవడంతో 215 పరుగల భారీ స్కోరును చేధించడం తమకు కష్టమైపోయిందని విశ్లేషించాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతుల్లో 53 పరుగులతో యువరాజ్ చివరిదాకా పోరాడాడు. కానీ అతడికి మిగతా బ్యాట్స్మెన్ల మద్దతు కరువవడంతో ముంబై చేధనలో ఓడిపోయింది. అతడు మా గెలుపు గుర్రం: ఢిల్లీ ఓపెనర్ కొలిన్ ఇంగ్రామ్ ‘గత ఐపీఎల్ సీజన్లో అదరగొట్టిన రిషభ్ పంత్ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ ముంబైపై మ్యాచ్‌లో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడటం సంతోషం. తనదైన రోజున పంత్ మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి సులువుగా లాక్కుంటాడు. శిఖర్ ధావన్‌తో నేను నెలకొల్పిన 83 పరుగుల భాగస్వామ్యం జట్టు భారీ స్కోరుకు బాటలు వేసింది. టీ20ల్లో త్వరగా వికెట్లు చేజార్చుకుంటే ఎక్కువ పరుగులు చేయడం కష్టం. వరల్డ్‌కప్ సన్నాహకాల నేపథ్యంలో నేను ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఈలోపు మిగతా క్రికెటర్లతో తక్కువ సమయంలో సాన్నిహిత్యం పెంచుకుంటే సమష్టిగా రాణించి జట్టుకు ఎక్కువ విజయాలు దక్కుతాయ’ని ఢిల్లీ ఓపెనర్ కొలిన్ ఇంగ్రామ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
ఫ్యూచర్ స్టార్ ఇన్నింగ్స్ విజయం
హైదరాబాద్: తొలిరోజు బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న ఫ్యూచర్‌స్టార్ ఆటగాళ్లు రెండో రోజు బౌలింగ్‌లోనూ రెచ్చిపోయారు. దీంతో డబ్ల్యూఎంసీసీతో జరిగిన మ్యాచ్‌లో ఫ్యూచర్‌స్టార్ జట్టు ఇన్నింగ్స విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం 54/4 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్‌సను ప్రారంభించిన డబ్ల్యూఎంసీసీ జట్టు 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 92 పరుగులు చేసి ఇన్నింగ్‌సను డిక్లేర్ చేసింది. శ్రీధర్ రెడ్డి 7 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్‌సను ప్రారంభించిన డబ్ల్యూఎంసీసీ జట్టు 32 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అజయ్ సింగ్ (82 నాటౌట్) పోరాడాడు. ప్రత్యర్థి బౌలర్లలో సోహాన్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్సలో ఫ్యూచర్‌స్టార్ జట్టు 71.4 ఓవర్లలో 9 వికెట్లకు 350 పరుగులు చేసింది. -
ఫ్యూచర్ స్టార్ 350/9 డిక్లేర్డ్
సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మెన్ వికాస్ రావు (198 బంతుల్లో 159 నాటౌట్; 19 ఫోర్లు), అనిల్ కుమార్ (85) రాణించడంతో ఫ్యూచర్ స్టార్ జట్టు తొలిరోజు భారీ స్కోరు సాధించింది. ఎ- డివిజన్ టూ డే (ప్లేట్) లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా డబ్ల్యుఎంసీసీతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 71. 4 ఓవర్లలో 9 వికెట్లకు 350 పరుగులు చేసి ఇన్నింగ్‌సను డిక్లేర్ చేసింది. వికాస్ రావు, అనిల్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆర్. యశ్వంత్ (33) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో జీఆర్ యశ్వంత్ 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డబ్ల్యుఎంసీసీ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో 4 వికెట్లకు 54 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు: ఎలిగెంట్: 105 (రంగనాథ్ 4/34, బాలరాజు 3/16), రెండో ఇన్నింగ్స్: 31/1 (7 ఓవర్లలో), హెచ్‌యూసీసీ: 154/9 డిక్లేర్డ్ (బి. బాలరాజు 41, సాయి రేవంత్ 58; ఆదిత్య 3/13).