
ఉల్లాసంగా.. ఉత్సాహంగా, కరెంట్, సింహా చిత్రాలతో ఫేమస్ అయిన స్నేహా ఉల్లాల్.. వెండితెరపై కనిపించి చాలా కాలమవుతోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌తో స్నేహా ఉల్లాల్ మళ్లీ వార్తల్లోకెక్కింది. తాను మొదటిసారిగా ఆసుపత్రిలో చేరారని, ఇలా జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. అంతేకాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
‘జీవితంలో మొదటిసారి ఆసుపత్రి పాలయ్యాను. విపరీతమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్నాను. ఎంతకీ తగ్గకపోవడంతో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. భయం అనిపించింది.. కానీ కొంత సమయం తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నాను. నన్ను ఎంత వీలైతే అంత విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. అది బోరింగ్ గా ఉంటుంది కదా.. అయితే నాతో నెట్ ఫ్లిక్స్ ఉంది. నాపట్ల కేర్ తీసుకునే మనుషులు నాతో ఉన్నారు. వీలైనంత త్వరగా మళ్ళీ వర్క్ లైఫ్ లోకి రావాలనుకుంటున్నా.. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment