కొడుకుతో మహేష్‌.. మనవడితో బాలయ్య.. | Tollywood Celebrities Latest Social Media posts | Sakshi
Sakshi News home page

కొడుకుతో మహేష్‌.. వర్కౌట్స్‌తో సమంత

Published Wed, Nov 11 2020 2:13 PM | Last Updated on Wed, Nov 11 2020 2:46 PM

Tollywood Celebrities Latest Social Media posts - Sakshi

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బీబీ3 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. బాలయ్యకు జోడిగా సయేషా సైగల్‌ నటించనున్నారు. ఓ వైపు సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య సమయం చిక్కినప్పుడల్లా తన కుటుంబంతో గడుపుతుంటారు. ఈ క్రమంలో బాలయ్య తన ముద్దుల మనవడు ఆర్యవీర్‌తో సరదాగా దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోలో బాలయ్య తన చిన్న కూతురు తేజస్విని కుమారుడితో ఫోటోకు ఫోజిచ్చారు. చదవండి: బాలకృష్ణ ఫస్ట్‌ లుక్‌ విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ అయినప్పటికీ తన ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అందరికి తెలిసిన విషయమే. ఇటీవల మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే వెకేషన్స్‌కు వెళ్లాడు.  ఎయిర్ పోర్ట్ దగ్గరి నుంచి టూర్‌కు చెందిన ప్రతి ఫోటోను మహేష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం సూపర్‌స్టార్‌ తన కొడుకు గౌతమ్‌తో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘ఇప్పుడు అతన్ని హగ్ చేసుకోవడం చాలా కష్టం.. కానీ ప్రేమతో దగ్గరికి తీసుకోవడానికి సరైన సమయం, కారణం కూడా అవసరం లేదు’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ అభిమానులు ఆకర్షిస్తోంది. చదవండి: విహార యాత్రకు మహేష్‌ బాబు ఫ్యామిలీ

చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు సమంత అక్కినేని. ప్రస్తుతం సినిమలు తగ్గించిన సామ్‌ పలు బిజినెస్‌లతో‌ తన జోరును కొనసాగిస్తున్నారు. సినిమాలు, బిజినెస్‌, ఫిట్‌నెస్‌.. ఇలా అన్నింటిలోనూ చాలా కేరింగ్‌గా ఉంటున్నారు. తాజాగా సమంత షేర్‌ చేసిన ఓ ఫిట్‌నెస్‌ వీడియోను చూస్తే మీరే వారెవ్వా అంటారు. ఇంటి ముందు గ్రాస్‌లో ట్రైనర్ సమక్షంలోనే వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.. చదవండి: బిగ్‌బాస్‌: సమంత జ్యువెలరీ ఖరీదెంతో తెలుసా

నవంబర్ 10న దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో క్రిష్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు నటుడు పవన్‌ కల్యాణ్‌. మంగళవారం సాయంత్రం ‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌లో పవన్ కల్యాణ్  క్రిష్ కు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు. కాగా క్రిష్. పవన్ కళ్యాణ్‌తో ఓ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం క్రిష్‌.. పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కోహినూర్ నేపథ్యంలో సాగే చారిత్రాత్మక కథ అయిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు.

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ను తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పూర్తి చేశారు. హీరో నాగచైతన్య విసిరిన ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన రకుల్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. అనంతరం తమ అభిమానులు మొక్కలు నాటాలని కోరారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement