
చరణ్ తేజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయుష్మాన్ భవ’. స్నేహా ఉల్లాల్ కథానాయిక. సి టి.ఎఫ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మొదటి లుక్‌ని విడుదల చేశారు. చరణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే మర్చిపోవాలా? పారిపోవాలా? చచ్చిపోవాలా? ప్రపంచం ఏమైతే నాకేంటి? సమాజం ప్రేమని చూసే విధానం మారాలి.. లేకపోతే చంపేస్తా’.. అనుకునే హీరో క్యారెక్టరైజేషన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.
మా చిత్రానికి ఇంత మంచి కథ అందించటంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న దర్శకుడు త్రినాథ్‌రావు నక్కినగారికి, స్క్రీన్‌ప్లే అందించిన రచయితలు పరుచూరి బ్రదర్స్‌కి, సహనిర్మాతగా వ్యవహరిస్తున్న దర్శకుడు మారుతిగారికి ధన్యవాదాలు. బాలీవుడ్ సంగీత దర్శకుడు మీట్ బ్రోస్ పాటలు ఆకట్టుకుంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ వేసవిలో విడుదల కానున్న మా సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు. హుజన్, పరుచూరి వెంకటేశ్వర రావు, రంగరాజన్, అశ్విన్, నిఖిత తదితరులు నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్స్: బి.ఎ. శ్రీనివాసరావు, హేమ రత్న, కెమెరా: దాసరది శివేంద్ర.