
285 ఏళ్ల క్రితం మహిళగా...
కేజ్రీ అనే చెట్లను కాపాడటం కోసం మహారాజుని సైతం ఎదిరించిన వీర మహిళ ‘అమృతా దేవి’. ఆమె ఇప్పటి మహిళ కాదు. 1730లో జోథ్‌పూర్‌లోని కెజార్లీ అనే గ్రామానికి చెందిన మహిళ ఆమె. కేజ్రీ చెట్లును నరకడం భరించలేక తన ప్రాణాలు సైతం వదులుకున్నారు. ఆమెతో పాటు ఆమె ముగ్గురు కూతుళ్లూ, ఆ గ్రామానికి చెందిన 363 మంది సైతం ప్రాణ త్యాగం చేశారు. 1730లో జరిగిన వాస్తవ సంఘటన ఇది.
ఈ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సాకో 363’. ఇందులో అమృతాదేవి పాత్రను స్నేహా ఉల్లాల్ చేస్తున్నారు. అంటే.. 285 ఏళ్ల క్రితం నాటి మహిళగా స్నేహా కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కల్యాణ్ సీరివి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అధిక శాతం షూటింగ్‌ను రాజస్తాన్‌లోనే జరుపుతారు. అమృతా దేవి పాత్ర చేయడం ఓ సవాల్ అనీ, ఒక మంచి చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆనందం దానంతట అది కలుగుతుందనీ స్నేహా పేర్కొన్నారు.