
చుక్కేశానంటున్న చక్కనమ్మ
చూసేందుకు అచ్చం ఐశ్వర్యారాయ్లాగే ఉండి.. తెలుగు ప్రేక్షకులను కొన్నాళ్ల పాటు ఆకట్టుకున్న స్నేహా ఉల్లాల్.. కెరీర్లో పెద్దగా సాధించిన విజయాలు లేవు. చాలా సినిమాల్లో చేసినా కూడా ఇప్పుడు ఆమె చెప్పుకోడానికి అంటూ పెద్ద పాత్రలు కూడా లేవు. ఇప్పుడు చేతిలో ఛాన్సులు కూడా అంతగా లేవు. అయితే.. ఎలాగైనా వార్తల్లో నిలవాలన్న తపన మాత్రం స్నేహా ఉల్లాల్కు బాగానే ఉన్నట్లుంది. అందుకే ఈ చక్కనమ్మ సరదాగా ఓ చుక్కేస్తూ.. ఫొటోలకు పోజులిచ్చింది.
తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఆమె సరదాగా గడుపుతున్నప్పుడే ఈ ఫొటో తీసినట్లు సమాచారం. తొలిసారి ఆమె షాంపేన్ తాగింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్లో కూడా తెలిపింది. ''తొలిసారి ఆల్కహాల్ తీసుకున్నా. ఇదే నా తొలి గ్లాసు. చాలా గర్వంగా ఉంది. ఇది షాంపేన్'' అని ఆమె ట్విట్టర్లో రాశారు.