బాలీవుడ్ బాటలో యువహీరో | Navadeep entering into bollywood with a biopic | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ బాటలో యువహీరో

Published Fri, Nov 13 2015 11:46 AM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM

బాలీవుడ్ బాటలో యువహీరో

బాలీవుడ్ బాటలో యువహీరో

హీరోగా టాలీవుడ్ లో ఆకట్టుకోలేకపోయిన ఓ యువ కథానాయకుడు త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. చందమామ సినిమాతో హీరోగా మంచి విజయం సాధించినా తరువాత ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. దీంతో సపోర్టింగ్ రోల్స్తో పాటు, నెగెటివ్ రోల్స్తోనూ ఆకట్టుకున్నాడు నవదీప్. హీరోగా సక్సెస్ కాలేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రం మంచి విజయాలు సాధిస్తున్నాడు.

మోడలింగ్లో సత్తా చాటుతున్న నవదీప్ బాలీవుడ్లో ఓ క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నాడు. ఇమ్రాన్ హష్మీ హీరోగా నటిస్తున్న బయోపిక్  'అజర్'లో కీలక పాత్రలో నటించనున్నాడు నవదీప్. ఈ పాత్ర కోసం చాలా మంది బాలీవుడ్ నటీనటులను పరిశీలించిన దర్శకుడు టోని ఫైనల్గా నవదీప్కే ఫిక్స్ అయ్యాడట. భారత క్రికెట్ టీం ను విజయం పథంలో నడిపించిన అజహరుద్ధీన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. మరో వారం రోజుల్లో నవదీప్ కూడా 'అజర్' టీంతో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే తెలుగు తమిళ భాషల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవదీప్, ఈ సినిమాతో బాలీవుడ్లో కూడా తన మార్క్ చూపించాలని భావిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement