Chandhamama
-
సిరిపురంలో షూటింగ్ సందడి
సిరిపురం(కరప) : ఈస్ట్‌వెస్ట్ ఎంటర్టైనర్స్ పతాకంపై నిర్మిస్తున్న ’మామా..ఓ చందమామా’ సినిమా షూటింగ్ గురువారం సిరిపురంలో జరిగింది. షూటింగ్‌ను చూసేందుకు సిరిపురం పరిసర గ్రామాల ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా కనిపించింది. ‘దృశ్య కావ్యం, షో టైం, ఇద్దరి మధ్య’ తో పా టు 18 సినిమాల్లో హీరోగా న టించిన సాయిరామ్ కార్తీక్, ‘దిక్కులు చూడకు రామయ్యా’లో హీరోయి¯ŒSగా నటిం చిన సనా మక్బుల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ సి రిపురంలో చిక్కాల దొరబాబు చెరువులవద్ద కొన్ని దృశ్యాలు చిత్రీకరిస్తున్నామన్నారు. ఇంతవరకూ 30 శాతం పూర్తయిందని, ఫిబ్రవరిలో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. న్ -
బాలీవుడ్ బాటలో యువహీరో
హీరోగా టాలీవుడ్ లో ఆకట్టుకోలేకపోయిన ఓ యువ కథానాయకుడు త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. చందమామ సినిమాతో హీరోగా మంచి విజయం సాధించినా తరువాత ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. దీంతో సపోర్టింగ్ రోల్స్‌తో పాటు, నెగెటివ్ రోల్స్‌తోనూ ఆకట్టుకున్నాడు నవదీప్. హీరోగా సక్సెస్ కాలేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం మంచి విజయాలు సాధిస్తున్నాడు. మోడలింగ్‌లో సత్తా చాటుతున్న నవదీప్ బాలీవుడ్లో ఓ క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నాడు. ఇమ్రాన్ హష్మీ హీరోగా నటిస్తున్న బయోపిక్ 'అజర్'లో కీలక పాత్రలో నటించనున్నాడు నవదీప్. ఈ పాత్ర కోసం చాలా మంది బాలీవుడ్ నటీనటులను పరిశీలించిన దర్శకుడు టోని ఫైనల్‌గా నవదీప్కే ఫిక్స్ అయ్యాడట. భారత క్రికెట్ టీం ను విజయం పథంలో నడిపించిన అజహరుద్ధీన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మరో వారం రోజుల్లో నవదీప్ కూడా 'అజర్' టీంతో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే తెలుగు తమిళ భాషల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవదీప్, ఈ సినిమాతో బాలీవుడ్లో కూడా తన మార్క్ చూపించాలని భావిస్తున్నాడు.