సిరిపురంలో షూటింగ్ సందడి
సిరిపురం(కరప) :
ఈస్ట్‌వెస్ట్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై నిర్మిస్తున్న ’మామా..ఓ చందమామా’ సినిమా షూటింగ్ గురువారం సిరిపురంలో జరిగింది. షూటింగ్‌ను చూసేందుకు సిరిపురం పరిసర గ్రామాల ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా కనిపించింది. ‘దృశ్య కావ్యం, షో టైం, ఇద్దరి మధ్య’ తో పా టు 18 సినిమాల్లో హీరోగా న టించిన సాయిరామ్ కార్తీక్, ‘దిక్కులు చూడకు రామయ్యా’లో హీరోయి¯ŒSగా నటిం చిన సనా మక్బుల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ సి రిపురంలో చిక్కాల దొరబాబు చెరువులవద్ద కొన్ని దృశ్యాలు చిత్రీకరిస్తున్నామన్నారు. ఇంతవరకూ 30 శాతం పూర్తయిందని, ఫిబ్రవరిలో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
న్