సాహసోపేతమైన నటన | Courageous acting | Sakshi

సాహసోపేతమైన నటన

Mar 30 2014 12:15 AM | Updated on Sep 2 2017 5:20 AM

సాహసోపేతమైన నటన

సాహసోపేతమైన నటన

నవదీప్, కావ్యాశెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘నటుడు’. ఎన్.ఎస్. ఆర్.ప్రసాద్ దర్శకుడు. రమేశ్‌బాబు కొప్పుల నిర్మాత. డీఎస్ రావు సమర్పకుడు.

నవదీప్, కావ్యాశెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘నటుడు’. ఎన్.ఎస్. ఆర్.ప్రసాద్ దర్శకుడు. రమేశ్‌బాబు కొప్పుల నిర్మాత. డీఎస్ రావు సమర్పకుడు. జయసూర్య స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని అనిల్ సుంకర ఆవిష్కరించి, కె.వి.వి.సత్యనారాయణకు అందించారు. టైటిల్ లోగోను తమ్మారెడ్డి భరద్వాజ్ అవిష్కరించారు. ‘‘ఈ కథను పదిమంది హీరోలకు వినిపిస్తే... ధైర్యంగా చేస్తానని ముందుకొచ్చిన ఏకైక హీరో నవదీప్. సాహసోపేతమైన ఈ పాత్రను అద్భుతంగా పోషించాడు తను’’ అని దర్శకుడు చెప్పారు.
 
  ‘‘‘పిల్లజమీందార్’ తర్వాత నాకు ఆ స్థాయి విజయం రాలేదు. అయినా... మొక్కవోని ధైర్యంతో ముందుకెళుతున్నాను. మంచి కథతో ఈ సినిమా తీశాం. ‘పిల్ల జమీందార్’ సినిమాను బాలీవుడ్‌లో నవదీప్‌తో తీయాలనుకుంటున్నాను’’ అని డీఎస్ రావు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement