Tollywood Drugs Case 2021: Enforcement Directorate Investigate Navadeep On September 13th - Sakshi
Sakshi News home page

Tollywood Drugs Case: నవదీప్‌పై ఈడీ ప్రశ్నల వర్షం

Published Mon, Sep 13 2021 11:00 AM | Last Updated on Mon, Sep 13 2021 11:51 AM

Tollywood Drugs Case: Enforcement Directorate Investigate Navadeep On September 13th - Sakshi

టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్‌ ట్లో ఈడీ విచారణకు హాజరయ్యాడు. తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన డాక్యకుమెంట్స్‌ నవదీప్‌ ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఈడీ నవదీప్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మని లాండిరింగ్‌, బ్యాంక్‌ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌తో బ్యాంకు లావాదేవీలపై కూడా ఈడీ విచారిస్తోంది. అయితే ఫ్ క్లబ్ పబ్ యజమాని నవదీప్ కావడం గమనార్హం. ఈ పబ్‌లో తరచుగా సినీ ప్రముఖులకు పార్టీలు నిర్వహించేవారని సమాచారం.

చదవండి: మరో కాస్ట్‌లీ కారు కొన్న రామ్‌ చరణ్‌, వీడియో వైరల్‌

ఈ పార్టీల్లో డ్రగ్స్ వినియోగించేవారని ఆరోపణలు ఉన్నాయి. ఈ డ్రగ్‌ కేసులో ప్రధాన నిందితులైన కెల్విన్, జీషాన్‌లు తరచూ హాజరైరయ్యేవారని గతంతో ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ కెల్విన్‌ను కూడా ఈడీ అధికారులు ఆదేశించారు. ప్రధానంగా మనీ లాండరింగ్ అంశంపైనే విచారణ జరగనుంది. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు దర్శకుడు పూరి జగన్నాథ్‌, నటి చార్మీ, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత​ సింగ్‌, హీరో రానా, రవి తేజ, నందులు విచారణకు గజరైన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement