హీరోను ఆటాడుకున్న ఎన్టీఆర్! | Bigg Boss host NTR teased navadeep in a show | Sakshi
Sakshi News home page

హీరోను ఆటాడుకున్న ఎన్టీఆర్!

Published Mon, Aug 21 2017 5:55 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

హీరోను ఆటాడుకున్న ఎన్టీఆర్!

హీరోను ఆటాడుకున్న ఎన్టీఆర్!

తెలుగులో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతిపెద్ద రియాల్టీ షో 'బిగ్‌బాస్'. ఈ షో ఇప్పటికే పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ హీరో నవదీప్‌ను హోస్ట్ ఎన్టీఆర్ సరదాగా ఆటపట్టించారు. 'మీ ఇంట్లో పాత 500, 1000 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. నువ్వు పాత నోట్లను ఎందుకు రిటర్న్ చేయలేదు. త్వరగా బ్యాగు సర్దుకో. నీకు కేవలం 5 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను. వెంటనే బయటకు వచ్చేయ్ అని' ఎన్టీఆర్ అనగానే షో కంటెస్టెంట్ నవదీప్ కు ఫ్యూజులు ఎగిరిపోయి, ముఖంలో రంగులు మారిపోయాయి. అసలే ఎలిమినేషన్ జరిగేరోజు కూడా కావడంతో నిజంగానే హౌస్ వదిలి పోవాలేమోనని నవదీప్ టెన్షన్ పడ్డాడు.

అయితే నవదీప్‌ను ఎన్టీఆర్ ఆట పట్టించడానికి ఓ కారణం ఉంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఇంట్లోకి లేటెస్ట్‌గా ఇచ్చిన వ్యక్తి కావడంతో ఇతర కంటెస్టెంట్లు విశేషాలు అడుగుతారు. రద్దయిన పాత 500, 1000 నోట్లు చెల్లుతున్నాయని చెప్పడమే కాదు, వారిని నమ్మించిన విషయం తెలిసిందే. 'హౌస్ సభ్యులకు నువ్వు కథలు చెప్పావు కదా. కథలు చెప్పడం నీకు మాత్రమే వచ్చా. మాకు కూడా వచ్చునంటూ' ఎన్టీఆర్ చెప్పగానే ఇతర కంటెస్టెంట్లు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. మరోవైపు సెల్ఫ్ గా ఎలిమినేషన్‌కు నామినేట్ చేసుకున్న కారణంగా హౌస్‌ను వీడుతున్న నటి ముమైత్‌ ఖాన్‌కు బిగ్‌బాస్ మరో  ఛాన్స్ ఇచ్చారు. కొన్ని టాస్క్‌లు సరిగ్గా నిర్వహిస్తే త్వరలో ఆమె మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement