న‌వ‌దీప్ బ‌ర్త్‌డే: ఇంట్ర‌స్టింగ్‌గా కొత్త సినిమా టైటిల్‌! | Rana Daggubati Released Navdeep Love Mouli Title Reveal Teaser | Sakshi
Sakshi News home page

Navdeep: ఆ నింగి క‌న్నా ఒంట‌రోడు.. ఈ మౌలి

Published Wed, Jan 26 2022 2:03 PM | Last Updated on Wed, Jan 26 2022 2:33 PM

Rana Daggubati Released Navdeep Love Mouli Title Reveal Teaser - Sakshi

యంగ్ హీరో, బిగ్‌బాస్ కంటెస్టెంట్ న‌వ‌దీప్ బ‌ర్త్‌డే నేడు(జ‌న‌వ‌రి 26). ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం టైటిల్ ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. దీనికి సంబంధించిన టీజ‌ర్‌ను భ‌ళ్లాల దేవ రానా ద‌గ్గుబాటి రిలీజ్ చేశాడు. 'పుట్టినందుకు థ్యాంక్స్' అంటూ మొద‌లైన ఈ టీజ‌ర్‌లో సినిమాకు ల‌వ్ మౌలి అన్న టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ చిత్రంలో న‌వ‌దీప్‌ను మ‌రో యాంగిల్‌లో చూడ‌బోతున్నార‌ని హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు అవ‌నీంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా నైరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ రెడ్డి నిర్మిస్తున్నాడు. గోవింద్ వ‌సంత సంగీతం అందిస్తున్నాడు. వీడియో చూస్తుంటే న‌వ‌దీప్ మ‌రో లెవ‌ల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ఈ టీజ‌ర్ గురించి రానా నిన్నే హింట్ ఇచ్చాడు. 'ఒక్క‌డు.. పొగ‌రెక్కిన ప్ర‌వాహం లాంటోడు.. నిలిచిపోయిన గాలిలోంటోడు.. నిల‌క‌డ లేని నిప్పులాంటోడు.. వెలుతురు తాక‌ని భూమిలాంటోడు.. ఆ నింగి క‌న్నా ఒంట‌రోడు.. మౌలి' అంటూ సాగే వీడియోను షేర్ చేస్తూ సినిమాకు హైప్ ఇచ్చాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement