రానా దగ్గుబాటి, సమంత ఇద్దరి మధ్య మంచి అనుబంధంతో పాటు స్నేహం కూడా ఉంది. వారిద్దరూ కలిసి పలుమార్లు టాక్ షోలలో సరదాగా మెప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా చాలామంది సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, తాజాగా సమంత షోషల్‌మీడియాలో రానా కోసం ప్రత్యేకంగా విషెష్ తెలిపింది.
రానా కోసం బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతూ సమంత ఇలా తెలిపింది. ' హ్యాపీ బర్త్‌డే రానా. నీవు చేసే ప్రతి పనిలోను 100శాతం ఎఫర్ట్ పెట్టి శ్రమిస్తావు. నేను కూడా నిన్ను స్ఫూర్తిగా తీసుకున్నాను. నీ మాదిరే నేను కూడా ప్రతి పనిని ఇంకా బాగా చేయాలి అనే కోరుకుంటున్నాను. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నా' అని ఆమె తెలిపింది.
సమయం కుదిరినప్పుడల్లా సమంతతో తాను మాట్లాడుతుంటానని రానా గతంలోనే చెప్పారు. సామ్ మయోసైటిస్ బారిన పడిన విషయం తెలిసిన తర్వాత కూడా ఆమె అనారోగ్య సమస్యల గురించి ఆయన తెలుసుకున్నారు. వీరిద్దరూ ‘బెంగళూరు డేస్’ తమిళం రీమేక్ కోసం కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. రీసెంట్‌గా జిగ్రా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో కూడా సమంత మాట్లాడుతూ.. రానా తనకు అన్న లాంటి వ్యక్తి అని సామ్ చెప్పింది. ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో రానా కూడా సమంత మై సిస్టర్ అని పిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment