నాగచైతన్య- శోభిత ధూళిపాళ తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో పదిలపర్చుకున్నారు. ఇన్నాళ్లు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇకమీదట భార్యాభర్తలుగా జీవితప్రయాణం చేయనున్నారు. డిసెంబర్ 4న రాత్రి అక్కినేని స్టూడియోలో వీరి వివాహం ఘనంగా జరిగింది.
ఇద్దరు పిల్లలైనా ఓకే..
పెళ్లి తర్వాత ఇద్దరూ జంటగా గుడికి వెళ్లి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇకపోతే నాగచైతన్య.. దగ్గుబాటి రానా టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే! ఈ టాక్ షోలో అతడు ఎన్నో విషయాలు పంచుకున్నాడు. చై మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉండాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలైనా ఓకే. వారిని కార్ రేసింగ్‌కు తీసుకెళ్తా.. వాళ్లతో ఉంటూ మళ్లీ నా బాల్యంలోకి వెళ్లిపోతా.. అని చెప్పాడు.
నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వే..
ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్రెండ్స్ ఎందుకు లేరన్న ప్రశ్నకు.. నువ్వు ఉన్నావ్ కదా అని రానాకు బదులిచ్చాడు. ఎక్కడేం జరిగినా అన్నీ చెప్తుంటావ్.. నేను ఏ టాక్ షోకు వెళ్లినా కూడా నా ఫ్రెండ్ ఎవరంటే నీ పేరే చెప్తాను. వాళ్లేమో ఆయన నీ బంధువు కదా? అని అడుగుతుంటారు. నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వేనని సమాధానమిస్తుంటాను అని చై తెలిపాడు.
వింతకల నిజం చేస్తానన్న చచై
ఈ సందర్భంగా రానా తనకు వచ్చిన ఓ వింతకల బయటపెట్టాడు. ఓ పార్టీలో చై చొక్కా విప్పేసి బార్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు కల వచ్చిందన్నాడు. అది విని నవ్విన చై త్వరలోనే దాన్ని నిజం చేస్తానన్నాడు. ఈ చిట్‌చాట్‌కు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో శనివారం (డిసెంబర్ 6) అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment