Sagileti Katha Movie Shows the Nativity of Rayalaseema - Sakshi
Sakshi News home page

హీరో నవదీప్ సమర్పిస్తున్న, 'సగిలేటి కథ'

Published Sun, Jul 23 2023 4:36 AM | Last Updated on Sun, Jul 23 2023 3:33 PM

Sagileti Katha movie shows the nativity of Rayalaseema - Sakshi

హీరో నవదీప్‌ సమర్పణలో రవితేజ మహాదాస్యం, విషిక కోట జంటగా నటించిన చిత్రం ‘సగిలేటి కథ’. రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వంలో నవదీప్‌ సమర్పణలో అశోక్‌ మిట్టపల్లి, దేవిప్రసాద్‌ బలివాడ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

‘‘రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో ఒక గ్రామంలో జరిగే ఘటనలతో సాగే చిత్రం ఇది. రాయలసీమ నేటివిటీ, సంస్కృతీ సంప్రదాయాలతో వచ్చే సన్నివేశాలు సహజంగా ఉంటాయి. ఇందులో చికెన్‌ కూడా ఒక పాత్ర. ఈ నెల 31న ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తాం’అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

‘సగిలేటి కథ కేవలం సినిమా కాదు. మన జీవితంలో ఉండే అన్ని భావోద్వేగాలా సమర్పణ. ప్రతి ఒక్క పాత్ర మిమ్మల్ని అలరిస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సినిమా లో హీరో గా చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను’అని రవితేజ మహాదాస్యం అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement