nativity
-
హీరో నవదీప్ సమర్పిస్తున్న, 'సగిలేటి కథ'
హీరో నవదీప్ సమర్పణలో రవితేజ మహాదాస్యం, విషిక కోట జంటగా నటించిన చిత్రం ‘సగిలేటి కథ’. రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంలో నవదీప్ సమర్పణలో అశోక్ మిట్టపల్లి, దేవిప్రసాద్ బలివాడ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ‘‘రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో ఒక గ్రామంలో జరిగే ఘటనలతో సాగే చిత్రం ఇది. రాయలసీమ నేటివిటీ, సంస్కృతీ సంప్రదాయాలతో వచ్చే సన్నివేశాలు సహజంగా ఉంటాయి. ఇందులో చికెన్ కూడా ఒక పాత్ర. ఈ నెల 31న ట్రైలర్ రిలీజ్ చేస్తాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘సగిలేటి కథ కేవలం సినిమా కాదు. మన జీవితంలో ఉండే అన్ని భావోద్వేగాలా సమర్పణ. ప్రతి ఒక్క పాత్ర మిమ్మల్ని అలరిస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సినిమా లో హీరో గా చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను’అని రవితేజ మహాదాస్యం అన్నారు. -
'ఆ వాస్తవాన్ని కేసీఆర్ సర్కార్ విస్మరించరాదు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన లేకపోవడం సరికాదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ భూములను బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ప్రభుత్వం ఇక్కడి వారికి ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఉద్యోగాల కోసం ఆ సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు అమలయ్యేలా జీవో జారీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఉద్యోగ అవకాశాల కోసమనే వాస్తవాన్ని కేసీఆర్ సర్కారు విస్మరించరాదని హితవు పలికారు. -
అర్హులైనవారికి సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
-
కేసీఆర్ ఇంకా ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారు
హైదరాబాద్ : కేసీఆర్ ఇంకా ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే బాగుంటుందని గంటా అన్నారు. స్థానికులు, స్థానికేతరుల అంశంపై కేసీఆర్ వ్యాఖ్యలు సరికావని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్థానికతపై రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టి నిర్ణయాలు తీసుకోని రాజ్యాంగ సంక్షోభం సృష్టించవద్దని గంటా సూచించారు. 1956 ముందు తెలంగాణలో పుట్టినవారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొనటం విడ్డూరంగా ఉందన్నారు. -
తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్
నల్గొండ : తెలంగాణకు చెందిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల స్థానికతను గుర్తించేది తెలంగాణ ప్రభుత్వమేనని, ఎవరి జోక్యం ఉండదని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. అడ్మిషన్ల విషయంలో పాత విధానాన్నే కొనసాగిస్తామని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో హైదరాబాద్‌లో చదివే సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించే ప్రసక్తే ఉండదని ఆయన అన్నారు. ఈ అంశంపై నిపుణులతో చర్చించి పకడ్బందీ ఫీజుల పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.