
'ఆ వాస్తవాన్ని కేసీఆర్ సర్కార్ విస్మరించరాదు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించిన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన లేకపోవడం సరికాదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ భూములను బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ప్రభుత్వం ఇక్కడి వారికి ఉద్యోగాలు కల్పించాలన్నారు.
ఉద్యోగాల కోసం ఆ సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు అమలయ్యేలా జీవో జారీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఉద్యోగ అవకాశాల కోసమనే వాస్తవాన్ని కేసీఆర్ సర్కారు విస్మరించరాదని హితవు పలికారు.