
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘క్రాక్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. బి. మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు రవితేజ. ఈ సినిమా చిత్రీకరణ గురువారం ప్రారంభమైంది. రవితేజ, శ్రుతిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా కథను సిద్ధం చేశారు దర్శకుడు. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్, పూజిత పొన్నాడ కీలక పాత్రధారులు. అమ్మిరాజు కానుమిల్లి సహ–నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment