సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి ఆదివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు.
జగదేవ్‌పూర్ (మెదక్): సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి ఆదివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. శనివారం రాత్రి ఫాంహౌస్‌కు వచ్చిన సీఎం ఇక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వ్యవసాయక్షేత్రంలో పంటలను పరిశీలించారు. మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, తెలంగాణ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌రావు, నెటాఫిమ్ మేనేజర్ నారాయణ, జేసీ వెంకట్రాంరెడ్డి, ఇరిగేషన్ స్పేషల్ అధికారి మల్లయ్య, ఆర్డీఓ ముత్యంరెడ్డిలతో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.
మే లోపు అన్ని రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, డ్రిప్పు పనులు ప్రారంభించాలని అధికారులను అదేశించారు. సాయంత్రం 4:30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు.