ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తన ఫాంహౌస్‌కు చేరుకున్నారు.
జగదేవ్‌పూర్(మెదక్): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తన ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఉదయం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన, పర్యటన అనంతరం ఇక్కడికి వచ్చారు.
సీఎం రాక నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడే బస చేసి ఆదివారం వ్యవసాయక్షేత్రంలో పర్యటిస్తారని తెలిసింది. ఆదివారం సాయంత్రానికి హైదరాబాద్ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.