sp sumathi
-
SP సుమతి గురువు ఎవరో తెలుసా..?
-
సంగారెడ్డిలో దొంగ అరెస్ట్
సంగారెడ్డి(మెదక్ జిల్లా): సంగారెడ్డి శివారులో జరిపిన వాహన తనిఖీల్లో రాజు గౌడ్ అనే దొంగ పట్టుబడినట్లు మెదక్ ఎస్పీ సుమతీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అతని వద్ద నుంచి 56 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి, ఒక లాప్టాప్, రూ.5 లక్షల 80 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.23 లక్షల విలువైన సామగ్రిని వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెల్ట్ తీద్దాం..!
* చెడు వ్యసనాల బానిసలను సన్మార్గంలో పెడదాం * గ్రామ సభ నిర్వహించండి... నేనూ వస్తా * బయ్యారంలో ఎస్పీ సుమతి గజ్వేల్: ‘గ్రామంలో బెల్టు షాపుల జాబితా తయారు చేయండి, పనులు చేయకుండా ఖాళీగా తిరుగుతున్న వారి వివరాలను సైతం సేకరించండి. త్వరలోనే గ్రామ సభ నిర్వహించండి. నేనూ వస్తా.. ఊరిని బాగుచేసుకుందాం.. ’ అంటూ ఎస్పీ సుమతి అన్నారు. ఆదివారం గజ్వేల్ మండలం బయ్యారంలో అత్యాచార ఘటనపై విచారణ చేపట్టేందుకు వచ్చిన ఎస్పీ గ్రామాస్తులను ఉద్దేశించి మాట్లాడారు. బెల్ట్ షాపులను విచ్చలవిడిగా నిర్వహించడం వల్ల యువత మద్యానికి బానిసై చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని పేర్కొన్నారు. మరో వైపు ఎలాంటి పనులు చేయకుండా ఖాళీగా ఉన్నవారు సైతం చెడు వ్యసనాలకు దగ్గరవుతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ దుస్థితిని మార్చాలంటే బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించడంతో పాటు చెడు వ్యసనాలకు గురైనవారిని సన్మార్గాంలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయత్నంలో గ్రామస్తులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. -
ఫాంహౌస్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
జగదేవ్‌పూర్(మెదక్): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తన ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఉదయం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన, పర్యటన అనంతరం ఇక్కడికి వచ్చారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడే బస చేసి ఆదివారం వ్యవసాయక్షేత్రంలో పర్యటిస్తారని తెలిసింది. ఆదివారం సాయంత్రానికి హైదరాబాద్ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. -
మద్యం తాగి వాహనం నడిపితే జైలే!
ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సంగారెడ్డి క్రైం : జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ సుమతి ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా జైలుకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జోగిపేట, పటాన్చెరు, జహీరాబాద్, గజ్వేల్, తూప్రాన్, నారాయణఖేడ్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. అంతేగాక అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపే వాహనాలను సీజ్ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోయిన దృష్ట్యా ఎస్పీ సుమతి ప్రత్యేక దృష్టి సారించి వాటి ని అరికట్టేందుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలకు సంగారెడ్డి పట్టణంలోకి భారీ వాహనాలను, ట్రాక్టర్లను అనుమతించడం లేదు. అంతేగాక పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, ఐబీ, ఐటీఐ, పోతిరెడ్డిపల్లి చౌరస్తా ప్రాంతాల్లో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. లెసైన్సులు, వాహన ధ్రువపత్రాలు లేకుండా నడిపే వాహనాలను సీజ్ చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2013, 2014 రెండేళ్లలో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి. 2013లో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన వారిపై ట్రాఫిక్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా 1,13,795 కేసులు నమోదు చేయగా వారి నుంచి రూ. 2,65,31,710 జరిమానా రూపంలో వసూలు చేశారు. 2014లో 1,11,587 కేసులు నమోదు చేయగా, రూ. 2,06,44,635 జరిమానా రూపంలో వసూలు చేశారు. 2014 సంవత్సరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై జిల్లా వ్యాప్తంగా 1112 కేసులు నమోదు చేశారు. డ్రైవర్లకు ప్రతినెలా అవగాహన సదస్సులు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ప్రతినెలా ఆటో డ్రైవర్లకు, వాహన చోదకులకు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో వాహన చోదకులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. సంగారెడ్డి పట్టణంలోని పాతబస్టాండ్ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ట్రాఫిక్ తీవ్రంగా వున్న కారణంగా వాహన చోదకులు అవగాహనతో మెలగాలి. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారముంటుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలి. - సుమతి, ఎస్పీ, మెదక్ తప్పతాగి పోలీసులకు చిక్కిన ఆటో డ్రైవర్ సంగారెడ్డి పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ పట్టపగలు పీకల దాకా మద్యం సేవించి ఆటో నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. సంగారెడ్డి పట్టణంలో ఆటో డ్రైవర్ ఎండీ యూసుఫ్ మద్యం సేవించి సోమవారం మధ్యాహ్నం పట్టణంలోని ఐబీ వద్ద మంజీరానగర్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్‌డ్రైవ్‌లో భాగంగా వాహన తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడు. అతడిని తనిఖీ చేయగా 210 శాతం మద్యం సేవించినట్లు తేలింది. ఈ మేరకు అతడిని ట్రాఫిక్ సీఐ లింగేశ్వర్‌రావు ఆదేశాల మేరకు ఎస్ఐ శ్రీనివాస్ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
బాస్ రాకపై గుబులు
సంగారెడ్డి క్రైం: కొత్త ఎస్పీ సుమతి బాధ్యతలు చేపట్టకముందే కొందరు ఖాకీల్లో గుబులు పుడుతోంది. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించని అధికారిగా సుమతికి పేరుండడంతో పనిదొంగలంతా సర్దుకునే పనిలో పడ్డారు. ఆమె 3వ తేదీన బాధ్యతలు చేపట్టనుండడంతో అంతకు ముందే సెలవులో వెళ్లిపోవాలని భావిస్తున్న కొందరు సెలవు చీటీతో ఎస్పీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎవరినీ ఉపేక్షించరట! జిల్లా ఎస్పీగా ఉన్న డా.శెముషీ బాజ్‌పాయ్ హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి బదిలీ కాగా, ఆమె స్థానంలో కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న బి.సుమతిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. నవంబర్ 3వ తేదీన ఏకాదశ మంచి రోజు ఉన్న కారణంగా ఆరోజే ఎస్పీగా బాధ్యతలు చేపట్టాలని కొత్త ఎస్పీ సుమతి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. విధులను నిర్లక్ష్యం చేసే పోలీసులు ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే వారి పట్ల సుమతి కఠినంగా వ్యవహరిస్తారన్న ప్రచారం పోలీసు శాఖలో జోరుగా సాగుతోంది. సుమతి వరంగల్ డీఎస్పీగా, మల్కాజ్గిరి ఏసీపీగా, సీఐడీ ఎస్పీగా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేశారు. పని విషయంలో ఆమె చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని శాఖలో చర్చించుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆమె పనిచేసిన సమయంలో విధులను సక్రమంగా నిర్వర్తించని పోలీసుల పట్ల ఉపేక్షించకపోవడం, శాఖాపరంగా చర్యలు తీసుకోవడం వల్ల ప్రస్తుతం జిల్లాలో కొందరు పోలీసులకు భయం పుట్టుకుంది. ఆమె రాకముందే సెలవులు పెట్టి విధులకు కొన్ని రోజులు దూరంగా ఉంటే మేలన్న యోచనలో కొందరు పోలీసులున్నారు. దీంతో తమకు దీర్ఘకాలిక సెలవులు కావాలంటూ ఎస్పీ శెముషీ వద్దకు లెటర్లు పట్టుకొని ప్రతిరోజు చక్కర్లు కొడుతున్నారు. కానీ ఆమె ససేమిరా అనడంతో ఆందోళన చెందుతున్నారని ఖాకీలు చర్చించుకుంటున్నారు.